Begin typing your search above and press return to search.

లిబ‌ర్టీ త‌ల న‌రికేసిన ట్రంప్‌

By:  Tupaki Desk   |   5 Feb 2017 9:41 AM GMT
లిబ‌ర్టీ త‌ల న‌రికేసిన ట్రంప్‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై ఊహించ‌ని రీతిలో వార్త‌ల్లో నిలుస్తున్నారు. మీడియా - జ‌ర్న‌లిస్టుల‌పై ట్రంప్ విమ‌ర్శ‌లు చేయ‌డం - త‌న‌దైన సొంత నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ నేప‌థ్యంలో ప్ర‌పంచ మీడియా సైతం ట్రంప్ పై త‌న‌దైన శైలిలో విరుకుప‌డుతోంది. ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క విధంగా ట్రంప్ వైఖ‌రిని త‌ప్పుప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో జ‌ర్మ‌నీకి చెందిన డెర్ స్పిగ‌ల్ మ్యాగ్జిన్ త‌న తాజా సంచిక‌పై ట్రంప్ కార్టూన్ వేసింది. అమెరికా విశిష్ట‌త‌ను చాటిచెప్పే స్టాచ్యూ ఆఫ్ లిబ‌ర్టీ త‌ల‌ను ట్రంప్ న‌రికేసిన‌ట్లుగా ఆ కార్టూన్ ఉంది. కార్టూనిస్టు ఎడెల్ రోడ్రిగ్జ్ ఆ కార్టూన్ వేశాడు. ప్ర‌జాస్వామ్య శిర‌స్సును ట్రంప్ న‌రికార‌న్న ఉద్దేశంతో ఆ కార్టూన్ వేసిన‌ట్లు రోడ్రిగ్జ్ తెలిపాడు. ఇటీవ‌ల అమెరికా - జ‌ర్మ‌నీ మ‌ధ్య సంబంధాలు బ‌ల‌హీన‌ప‌డ్డాయి. జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఏంజిలా మెర్క‌ల్ విధానాల‌ను ట్రంప్ త‌ప్పుప‌ట్టారు. శ‌ర‌ణార్థుల‌ను స్వాగ‌తించ‌డం జ‌ర్మ‌నీ చేసిన త‌ప్పు అంటూ ట్రంప్ విమ‌ర్శించారు. అయితే డెర్ స్పిగ‌ల్ వేసిన కార్టూన్‌ పై ఆ దేశంలోనే వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. అంతేకాదు యురోపియ‌న్ యూనియ‌న్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఆ కార్టూన్ వేసిన తీరును ఖండించారు. ట్రంప్‌పై వేసిన కార్టూన్‌ ను రోడ్రిగ్జ్ స‌మ‌ర్థించుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు - డోనాల్డ్ ట్రంప్ మ‌ధ్య పోలిక‌లు ఉన్నాయ‌ని, ఇద్ద‌రూ తీవ్ర‌వాదులే అంటూ కార్టూనిస్టు అభిప్రాయ‌ప‌డ్డారు.

జ‌ర్మ‌న్ ప‌త్రిక వేసిన కార్టూన్ త‌ర‌హాలోనే గ‌తంలో న్యూయార్క్ డైయిలీ న్యూస్ మీడియా సంస్థ కూడా త‌న ఫ్రంట్ పేజీలో ఇలాంటి కార్టూనే వేసింది. కాక‌పోతే ఆ కార్టూన్‌లో ర‌క్త‌పాతం ఎక్కువ‌గా చూపించారు. డెర్ స్పిగ‌ల్ ఎడిట‌ర్ కూడా ట్రంప్‌పై త‌న మ్యాగ్జిన్‌ లో ఎడిటోరియ‌ల్ రాశారు. ట్రంప్ కుట్ర‌కు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, దేశంలో స్వ‌చ్ఛ‌లేని ప్ర‌జాస్వామ్యాన్ని నెల‌కొల్పేందుకు ట్రంప్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆ ఎడిటోరియ‌ల్‌లో విమ‌ర్శించారు. ట్రంప్‌ పై ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా క‌థ‌నాలు రాస్తున్న మీడియా సంస్థ‌ల‌పై వైట్‌హౌజ్ సీరియ‌స్ అయ్యింది. మీడియా సంస్థ‌లు ట్రంప్‌పై అస‌త్య‌, బాధ్య‌తార‌హిత‌మైన రిపోర్టింగ్ చేస్తున్నాయ‌ని వైట్‌హౌజ్ ఆరోపించింది. ముస్లిం శ‌ర‌ణార్థుల‌ను అడ్డుకునేందుకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్ జారీ చేసిన త‌ర్వాత అమెరికా దేశాధ్య‌క్షుడిపై వివిధ మీడియా సంస్థలు ప్ర‌త్యేక క‌థ‌నాల‌ను ప్ర‌చురిస్తూనే ఉన్న సంగ‌తి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/