Begin typing your search above and press return to search.

టెక్నాల‌జీకి దూరం ఉండాలంటున్న ట్రంప్

By:  Tupaki Desk   |   1 Jan 2017 9:40 AM GMT
టెక్నాల‌జీకి దూరం ఉండాలంటున్న ట్రంప్
X
త‌న కామెంట్లతో అత్య‌ల్ప కాలంలోనే ప్రపంచం దృష్టిని త‌న‌వైపు తిప్పుకొన్న అమెరికా కాబోయే అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశారు. ప్ర‌జ‌లంతా డిజిట‌ల్ మంత్రం జ‌పిస్తుంటే అగ్ర రాజ్యం అధినేత అయిన ట్రంప్ మాత్రం అలాంటివి వ‌ద్దే వ‌ద్దు అంటున్నారు. ఏ కంప్యూట‌ర్ సేఫ్ కాదు.. ఈమెయిల్స్ వ‌ద్దు.. కొరియరే ముద్దు అని పిలుపునిచ్చారు.

కొత్త ఏడాదిని పుర‌స్క‌రించుకొని ప్ర‌సంగించిన ట్రంప్ అత్యంత ర‌హ‌స్య స‌మాచారం - ముఖ్య‌మైన ప‌త్రాల‌ను దాచుకోవ‌డానికి-చేర‌వేయ‌డానికి కంప్యూట‌ర్లు ఏమాత్రం సుర‌క్షితం కాద‌ని స్ప‌ష్టంచేశారు. "ఏదైనా ముఖ్య‌మైన స‌మాచారం చేర‌వేయాలంటే పాత ప‌ద్ధ‌తిలో దానిని కాగితంపై రాసి కొరియర్ చేయాలి. ఎందుకంటే ఏ కంప్యూట‌ర్ సుర‌క్షితం కాదు. ఈ విష‌యంలో ఎవ‌రేమ‌నుకున్నా.. నేను ప‌ట్టించుకోను"అని ట్రంప్ అన్నారు. అందుకే త‌న హ‌యాంలో ఈ ర‌హ‌స్య స‌మాచారాన్ని దాచుకోవ‌డానికి ఓ కొత్త ప‌ద్ధ‌తి అవ‌లంభించ‌బోతున్న‌ట్లు తెలిపారు. ట్రంప్ త‌ర‌చూ ట్వీట్స్ చేసినా.. ఈమెయిల్స్ మాత్రం చాలా త‌క్కువ‌గా వాడుతారు.

ఇదిలాఉండ‌గా హ్యాకింగ్‌ కు పాల్ప‌డుతున్నారంటూ ర‌ష్యాకు చెందిన దౌత్య‌వేత్త‌ల‌ను ప్ర‌స్తుత అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా దేశం నుంచి వెలివేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ర‌ష్యాలోని అమెరికా కాన్సులేట్ లో గ‌ల‌ నలుగురు దౌత్యవేత్తలతోపాటు మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయంలోని 31మంది ఉద్యోగులను దేశం నుంచి బహిష్కరించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ తిర‌స్క‌రించారు. ఈ నిర్ణ‌యంపై డొనాల్డ్‌ ట్రంప్ స్పందిస్తూ 'పుతిన్‌ది గొప్ప నిర్ణయం.. నాకు తెలుసు ఆయన తెలివైన వ్యక్తి' అని ట్వీట్‌ చేశారు. దీంతో ఒబమా సర్కారు, ట్రంప్‌ మధ్య అంతరం ఉన్నదన్న విషయం స్పష్టమయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/