Begin typing your search above and press return to search.

ట్రంప్ లేఖ‌నే చెత్త‌బుట్ట‌లో వేసింది ఎవ‌రంటే...

By:  Tupaki Desk   |   17 Oct 2019 5:18 PM GMT
ట్రంప్ లేఖ‌నే చెత్త‌బుట్ట‌లో వేసింది ఎవ‌రంటే...
X
అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు మైండ్ బ్లాంక‌య్యే ప‌రిణామం ఇది. అమెరికా ఆదేశాల‌ను ధిక్క‌రించడంలో సుప‌రిచిత‌మైన ట‌ర్కీ మ‌రోమారు షాకిచ్చింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ త‌న‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాసిన ఉత్తరాన్ని చెత్త బుట్టలో పడేశారనేది ఈ సంచ‌ల‌నానికి కార‌ణం. సిరియాలో దాడులకు దిగొద్దంటూ రాసిన లేఖ‌ను ఇలా డ‌స్ట్‌ బిన్ పాలు చేశార‌నేది అంత‌ర్జాతీయంగా తీవ్ర క‌ల‌కలం రేకెత్తిస్తోంది.

సిరియా దాడుల నేప‌థ్యంలో...ఎర్డొగాన్‌ ను ఉద్దేశించి ట్రంప్ లేఖ రాశారు. సిరియాలో దాడుల‌తో వేల మంది అమాయకుల మరణానికి కారణమవుతావా? అని ఈ లేఖ‌లో ట్రంప్ ప్ర‌శ్నించారు. ఓ రాక్షసుడిగా నువ్వు చరిత్రలో మిగిలిపోతావ్. నువ్వు మూర్ఖుడిలా ప్రవర్తించకు. ఈ తప్పు జరిగితే చరిత్ర నిన్ను క్షమించదు..టర్కీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన వాడిగా నన్ను మిగిలిపోమంటావా?" అంటూ ట్రంప్ త‌నంత తానుగా పెద్ద‌న్న పాత్ర పోషించారు. ఓ దేశాధ్యక్షుడు ఇలా రాస్తారా అనుకోవ‌డమే కాకుండా...ట్రంప్ సూచనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడ‌మే కాకుండా...ఉత్తరాన్ని చెత్తబుట్ట‌లో పడేశారట. ఈ షాకుల‌కు కొన‌సాగింపుగా...సిరియాలో దాడికి దిగాలంటూ ట్రంప్ సూచ‌న‌లు లైట్ తీసుకొని ఎర్డొగాన్ ఆదేశాలు జారీ చేయడం కొస‌మెరుపు.

ఇదిలాఉండ‌గా, ఈ ఏడాది ఆరంభం నుంచే ట‌ర్కీ-అమెరికా మ‌ధ్య విబేధాలు మొద‌ల‌య్యాయి. అమెరికా - ట‌ర్కీ.. నాటో ద‌ళాల్లో స‌భ్య‌దేశాలు. కానీ ర‌ష్యాతో ట‌ర్కీ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తోంది. అమెరికా వ‌ద్ద వంద ఎఫ్‌-35 యుద్ధ విమానాల‌ను కొనుగోలు చేయాల‌ని ట‌ర్కీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ర‌ష్యా ఎస్‌-400 సిస్ట‌మ్స్ ఉన్న ద‌గ్గ‌ర త‌మ ఎఫ్‌35 విమానాలు ఉండ‌రాద‌ని అమెరికా వాదించిందిది. త‌మ ఫైట‌ర్ జెట్ల‌ను రష్యా హ్యాక్ చేస్తుంద‌ని అమెరికా అభిప్రాయ‌ప‌డింది. అయిన‌ప్ప‌టికీ... అగ్ర‌రాజ్యం అమెరికా ఆదేశాల‌ను ట‌ర్కీ ధిక్క‌రించింది. ర‌ష్యా త‌యారు చేసే ఎస్‌-400 క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన వాహ‌నాలను త‌మ సైన్యంలో భాగం చేసుకున్నాయి. రాజ‌ధాని అంకారాలోని విమానాశ్ర‌యానికి ఎస్‌-400 క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ వాహ‌నాలు ప్ర‌ద‌ర్శించింది.