Begin typing your search above and press return to search.

మారడీ ట్రంప్; హారతులు తీసుకుంటేనే ఆక్షింతలు

By:  Tupaki Desk   |   7 Nov 2016 10:10 AM GMT
మారడీ ట్రంప్; హారతులు తీసుకుంటేనే ఆక్షింతలు
X
కొందరు ఎంతకూ మారరు. వారు మారాలనుకోవటం కూడా తప్పే అవుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తీరు అచ్చం ఇలానే ఉంటుంది. ప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించాలంటే ప్రపంచాన్ని తనతో తీసుకెళ్లే లక్షణం ఉండాలి. అంతేకానీ.. తమను వాళ్లు దోచుకుంటున్నారు.. వీళ్లు దోచుకుంటున్నారన్న వ్యాఖ్యలతో పాటు.. ఎవరికి వారిని దూరం చేసుకునే తీరు అస్సలు ఉండకూడదు. అమెరికా అధ్యక్షుడిగా ఎలాంటి లక్షణాలైతే ఉండాలో.. సరిగ్గా అలాంటివేమీ లేని నేతగా ట్రంప్ ను పలువురు అభివర్ణిస్తుంటారు.

దీనికి తగ్గట్లే తన కంపు మాటలతో అందరిని దూరం చేసుకునే ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎంతో కీలకమైన పోలింగ్ కు రెండు రోజుల ముందు కూడా తన వైఖరిని వీడలేదు. తాజాగా ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. అమెరికన్ల ఉద్యోగాల్ని భారత్.. చైనాలు తన్నుకుపోతున్నాయని.. వారి కారణంగా దేశంలో 70వేల ఫ్యాక్టరీలు మూతపడినట్లుగా ఆరోపించారు. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా జరగని రీతిలో అమెరికాలోని ఉద్యోగాలు దోపిడీకి గురి అవుతున్నట్లుగా వెల్లడించారు.

అమెరికన్ కంపెనీలు అమెరికాలోని ఉద్యోగాల్ని భారత్.. చైనా.. మెక్సికో.. సింగపూర్ తదితర దేశాలకు తరలిస్తున్నట్లగా మండిపడ్డారు. ప్రపంచ వాణిజ్య సంస్థలోకి చైనా అడుగుపెట్టినప్పటి నుంచి అమెరికాలో 70వేల ఫ్యాక్టరీలు మూతబడినట్లుగా ట్రంప్ ఆరోపించారు. ఈ ఒప్పందానికి క్లింటన్.. హిల్లరీలు మద్దతు ఇచ్చి అమెరికాను ప్రమాదంలోకి నెట్టినట్లుగా విమర్శించారు.

తన విద్వేషపూరిత మాటలతో ఊగిపోయే ట్రంప్.. తాజాగా భారత్.. చైనాతో సహా మరికొన్ని దేశాలపై విరుచుకుపడుతున్న తీరు ట్రంప్ కు ప్రతికూలంగా మారుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఒకవైపు ట్రంప్ కుటుంబ సభ్యులు భారతీయుల్ని ఆకర్షించే పనిలో భాగంగా.. గుళ్లకు వెళ్లటం.. అక్కడ ఇచ్చే హారతుల్ని అందుకోవటం లాంటి చేస్తుంటే.. మరోవైపు ట్రంప్ మాత్రం తమ దేశాన్ని భారత్.. చైనాలు దోపిడీ చేసేస్తుందని.. అమెరికన్ల ఉద్యోగాల్ని కొల్లగొట్టేస్తుందని మండిపడటం గమనార్హం. మొదట్నించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అలవాటు ఉన్న ట్రంప్.. ఎన్నికల పోలింగ్ కు రెండు రోజుల ముందు కూడా తన తీరును మార్చుకోవటం .. విద్వేషపు వ్యాఖ్యాల్ని కంటిన్యూ చేయటం ఆసక్తికరంగా మారింది.

ఇదిలాఉండ‌గా అమెరికాలో రిపబ్లికన్ పార్గీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోన్న డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోరుతూ ముంబైలో పూజలు నిర్వహిస్తున్నారు. ముంబైలోని సిద్దం ఆలయంలో ఇవాళ హోమం నిర్వహించారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కూడా ట్రంప్ అభిమానులు ఆయన ఘన విజయం సాధించాలని పలుచోట్ల పూజలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ కూడా తన గెలుపు కోసం విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/