Begin typing your search above and press return to search.
మనకు గుడ్ న్యూస్ చెప్పి పాకిస్తాన్ కు ట్రంప్ షాక్
By: Tupaki Desk | 17 March 2017 2:32 PM GMTఅగ్రరాజ్యం అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనదేశం విషయంలో తీపికబురు చెప్పారు. అదే సమయంలో పొరుగు దేశమైన పాకిస్తాన్ కు షాక్ ఇచ్చారు. కీలకమైన ఆర్థిక సహాయం గురించి ఇదంతా. 2018 సంవత్సరపు అమెరికా బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన వార్త ఇది. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలకు అమెరికా తన వాటాగా చెల్లించాల్సిన నిధులను పూర్తిగా నిలిపివేయడమో లేక కోతపెట్టడమో చేయాలని బడ్జెట్ టీంకు ట్రంప్ సూచించారు. 1.1 లక్షల కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ లో అమెరికా విదేశీ సహాయంలో 28 శాతం కోత పెట్టాలని, సైనిక సహాయాన్ని గ్రాంట్ల నుంచి రుణాలుగా మార్చాలని పేర్కొన్నారు. అమెరికా సాయం మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్న పాకిస్థాన్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ అంటున్నారు. మరోవైపు టీకాలు-చికిత్సలకు ఇచ్చే నిధులను కొనసాగించాలని ప్రతిపాదించారు. దీనివల్ల భారత్ లో టీకాలు - హెచ్ ఐవీ - మలేరియా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగే అవకాశముంది. ఇలా ఏకకాలంలో ట్రంప్ రెండు దేశాల విషయంలో ట్రంప్ భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలాఉండగా...ఉత్తరకొరియా అణుకార్యక్రమాన్ని నిలిపివేయించేందుకు రెండు దశాబ్దాలపాటు జరిపిన దౌత్య కృషి విఫలమైందని, ఇప్పుడిక కొత్త వైఖరి చేపట్టక తప్పదని అమెరికా విదేశాంగమంత్రి రెక్స్ టిల్లర్ సన్ అన్నారు. టోక్యోలో జపాన్ విదేశాంగమంత్రి ఫూమియో కిషిడాతో కలిసి మీడియాతో మాట్లాడారు. తప్పుదారిలో పోతున్న పొరుగుదేశాన్ని నియంత్రించడంలో చైనా తనవంతు పాత్ర నిర్వర్తించాల్సి ఉందని అన్నారు. పెరుగుతున్న ముప్పు దృష్ట్యా ఉత్తరకొరియా సమస్యపై కొత్తవైఖరి తప్పదని టిల్లర్ సన్ స్పష్టం చేశారు. ఆసియా-పసిఫిక్ శాంతి - సుస్థిరతలకు అమెరికా - జపాన్ సంబంధాలు కీలకమని అన్నారు. టిల్లర్ సన్ కు ఇదే తొలి ఆసియా పర్యటన. జపాన్ తర్వాత ఆయన దక్షిణకొరియా - చైనా దేశాల్లో పర్యటిస్తారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/