Begin typing your search above and press return to search.
ఆ మహిళానేతకు ట్రంప్ బ్రేకులు వేశారు
By: Tupaki Desk | 15 March 2017 8:07 AM GMTజర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అమెరికా పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఖరి నిమిషంలో రద్దుచేశారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఏంజెలా మెర్కెల్ అమెరికా వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. అదే సమయంలో ట్రంప్ ఆమెకు ఫోన్ చేసి 'ప్రస్తుతం అమెరికాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని.. ఆంగిపోండి' అని చెప్పారు. దీంతో విమానాశ్రయం వరకు వచ్చి మెర్కెల్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం...అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్ మంగళవారం సమావేశం కావాల్సి ఉంది. దీంతో వాషింగ్టన్ వెళ్లేందుకు మెర్కెల్ సోమవారం బెర్లిన్ లోని ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. మరికాసేపట్లో ఎయిర్ పోర్టుకు చేరుకుంటారనగా.. ట్రంప్ ఆమెకు ఫోన్ చేసి అమెరికా రావొద్దని కోరారు. ఈ విషయాన్ని మెర్కెల్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని.. అందుకే రావొద్దని చెప్పినట్టు ఆమె వివరించారు. అయితే అప్పటికే మెర్కెల్ పార్టీకి చెందిన కొందరు నేతలు, మీడియా వ్యక్తులు విమానంలో కూర్చున్నారు. దీంతో ఆమె నేరుగా విమానాశ్రయానికి వెళ్లి జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అమెరికా శ్వేతసౌధం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రస్తుతం అమెరికాలో తుఫాను ఏర్పడిందని.. దీని వల్ల కొన్ని విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. మెర్కెల్ పర్యటన శుక్రవారం నాటికి వాయిదా వేసినట్టు శ్వేతసౌధం తెలిపింది.
ఇదిలాఉండగా...గతంలో కూడా మెర్కెల్ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2010లో మెర్కెల్ అమెరికా పర్యటనలో ఉండగా.. ఐస్లాండ్‌లో అగ్నిపర్వతం బద్ధలైంది. భారీ పొగలు వ్యాపించడంతో మెర్కెల్ తిరుగు ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. దీంతో పోర్చుగల్, ఇటలీ మీదుగా ఆమె జర్మనీ చేరుకోవాల్సి వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/