Begin typing your search above and press return to search.
మోదీ... నిజమైన స్నేహితుడుః ట్రంప్
By: Tupaki Desk | 25 Jun 2017 9:38 AM GMTభారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. మోదీ తనకు‘నిజమైన స్నేహితుడి’గా వర్ణిస్తూ ట్వీట్ చేశారు. సోమవారం శ్వేతసౌధంలో మోదీతో ముఖ్యమైన వ్యూహాత్మక అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ట్విట్టర్లో తెలిపారు. మూడుదేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం అమెరికాలో అడుగుపెట్టారు. వాషింగ్టన్ డీసీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
తనకు హార్థిక స్వాగతం పలికినందుకు ట్రంప్‌కు మోదీ ధన్యావాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ట్రంప్ తో సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ట్రంప్ తో మోదీ భేటీకానున్నారు. మరోవైపు ప్రవాస భారతీయులు కూడా మోదీకి అపూర్వ స్వాగతం పలికారు. విలార్డ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ లో ఆయనను ప్రవాస గుజరాతీయులు కలిశారు.
మోదీ పర్యటనను చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నామని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మోదీ - ట్రంప్ ల సమావేశానికి, విందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వైట్ హౌస్ లో డిన్నర్ చేయనున్న తొలి విదేశీ ప్రధాని మోదీ కావడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/