Begin typing your search above and press return to search.

మోడీకి ఫోన్ చేసి ట్రంప్ ఏం మాట్లాడారు?

By:  Tupaki Desk   |   25 Jan 2017 4:57 AM GMT
మోడీకి ఫోన్ చేసి ట్రంప్ ఏం మాట్లాడారు?
X
షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీతో అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట వేళలో ఆయన భారత ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. అప్పటికి భారతకాలమానం ప్రకారం రాత్రి11.30 గంటలు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ పలు దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ లెక్కన చూస్తే. ట్రంప్ ఫోన్ చేసిన మాట్లాడిన వారిలో మోడీ ఐదోవారు అవుతారు. షెడ్యూల్ ప్రకారం ఫోన్ చేసిన ట్రంప్ ఇరుదేశాల మధ్యనున్న సంబంధాల గురించి.. భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడినట్లు చెబుతున్నారు.

ఒక విధంగా ఇది ఫార్మల్ కాల్ అని.. ఈ సందర్భంగా ఒకరినొకరు మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవటం మినహా.. కీలక చర్చలు జరిపే అవకాశం లేదని చెబుతున్నారు. ఫోన్ కాల్ వ్యవధి కూడా ఎక్కువసేపు ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఫోన్ కాల్ సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్యంతో పాటు.. ఇరువురి పర్యటనల గురించి కూడా ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించిన వెంటనే.. ఆయనకు అభినందనలు తెలిపిన ప్రముఖుల్లో మోడీ మొదటి ఐదుగురిలో ఒకరు. అదే సమయంలో తానుఅధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ట్రంప్ ఫోన్ చేసిన మొదటి ఐదుగురిలో మోడీ ఐదో వారు కావటం గమనార్హం. మరి.. ఇరువురి మధ్య మొదలైన ఫోన్ కాల్ సంభాషణలు రానున్నరోజుల్లో ఏ దిశగా వెళతాయో చూడాలి. ఇదిలా ఉండగా.. తన పరివారంలో భారతీయులకు ట్రంప్ పెద్దపీట వేయటం కనిపిస్తోంది.

నెట్ న్యూట్రాలిటీని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రవాస భారతీయుడు అజిత వరదరాజ్ పాయ్ ను ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చీఫ్ గా నియమించటం గమనార్హం. ఇప్పటికే ట్రంప్ పరివారంలో పలువురు ప్రవాస భారతీయులు విధులు నిర్వర్తిస్తున్నారు. నికీ హేలీ.. సీమా వర్మ.. ప్రీత భరారాలు ఉన్నారు. తాజాగా అజిత నియామకం పూర్తి అయ్యింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/