Begin typing your search above and press return to search.
తొడపాశం పెట్టి మళ్లీ గిల్లుతున్న ట్రంప్
By: Tupaki Desk | 8 Jun 2017 8:06 AM GMTలాగి పెట్టి ఒక్కటి పీకి.. ఫీల్ కావొద్దు.. నీ బాధను నే తీరుస్తా? అంటే ఎలా ఉంటుంది? ఇంచుమించు ఇదే ధోరణితో వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి ఇప్పుడు విస్మయాన్ని రేకెత్తిస్తోంది. ఒక దేశానికి కోలుకోలేని దెబ్బేసి మరీ.. సాయం చేయాలా? అన్న మాటను ఫోన్ చేసి చెప్పటం ట్రంప్ కే చెల్లుతుందేమో? ఖతార్ తో అరబ్ దేశాలు కటీఫ్ చెప్పటం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
ఈ కటీఫ్ వెనుక ఉగ్రవాదం.. అదీ.. ఇదీ అన్న మాటలు వినిపించినా.. అవన్నీకాదు.. అదంతా తన గొప్పతనమే అంటూ ట్రంప్ ఓపెన్ అయిపోవటం తెలిసిందే. ఇటీవల తాను జరిపిన సౌదీ అరేబియా పర్యటన సత్ఫలితాన్ని ఇచ్చినట్లుగా ట్రంప్ పేర్కొనటం ద్వారా ఖతార్ గుండెల మీద తన్నేలా చేసింది తానేనన్న విషయాన్ని ట్రంప్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. తాజాగా ట్రంప్ ఖతార్ రాజుకు ఫోన్ చేశారు. అవసరమైతే తాజా నిషేధంపై తాను రాజీ కుదురుస్తానని హామీ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఖతార్ రాజు ఎమిర్ షేక్ తమీమ్ బిన్ అహ్మద్ అల్ తానికి ఫోన్ చేసిన ట్రంప్.. అరబ్ దేశాల మధ్య నెలకొన్న వివాదాన్ని తాను పరిష్కరిస్తానని.. అవసరమైతే వైట్ హౌస్ లో విందు సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పినట్లుగా ఎమిరేట్స్ కు చెందిన ఒక అధికారి వెల్లడించారు.
చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేసినట్లుగా సదరు అధికారి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటంలో తమ చిరకాల శత్రువైన ఇరాన్ కు ఖతార్ సహకరిస్తుందని అరబ్ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణల్ని ఇప్పటికే ఖతార్ బలంగా తిరస్కరించింది. ఇదిలా ఉంటే.. ఖతార్ లో అధికార మార్పిడి కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వినిపించాయి. అయితే.. ఆ దేశం తీరు మార్చుకోవటం కోసమే తాము ప్రయత్నిస్తున్నామే తప్పించి అధికార మార్పిడికి ప్రయత్నించటం లేదని చెబుతున్నారు. ఇంత చేసినోళ్లు.. అవసరమైతే ఖతార్ అధికార మార్పిడి విషయం అగ్రరాజ్యానికి పెద్ద విషయం కాదనే చెప్పాలి. ఏమైనా వాత పెట్టి మరీ కారం రాయటం.. అది కూడా ఓపెన్ గానే చేయటం ట్రంప్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/