Begin typing your search above and press return to search.
అమెరికా ఎన్నికల్లో సెక్స్ అండ్ డ్రగ్స్!
By: Tupaki Desk | 16 Oct 2016 6:23 AM GMTఅమెరికా ఎన్నికలు.. అగ్రరాజ్య అధ్యక్షుడి కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎప్పుడూ జరగని పరిణామాలు చోటుచేసుకుంటునాయని, ఎప్పుడూ వినిపించనన్ని వివాదాస్పద వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని, ఇదే సమయంలో ఎన్నడూ ఏ అధ్యక్ష అభ్యర్ధి పై రానన్ని లైంగిక ఆరోపణలు వస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఈ సమయంఓ "మొస్ట్ రొమాంటిక్ ఎలక్షన్స్" అంటూ ఇంగ్లిష్ పత్రికల్లో కథనాలూ వెలువడుతున్నాయి. అయితే కథనాలు - వివాదాలు - వివాదాస్పద వ్యాఖ్యలు ఇవన్నీ ట్రంప్ చుట్టూ తిరగడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ఎన్నికలు దగ్గరయ్యే ఈ సమయం వరకూ ట్రంప్ నోరు చేసిన కంపు అంతా ఇంతా కాదు! వ్యూహాత్మకంగా శతృవుపై దాడిచేయడం, శాస్త్రీయంగా ఇరుకున పెట్టడం వంటి విషయాలు మరిచిన ట్రంప్... కేవలం వివాదాస్పద వ్యాఖ్యలకే పరిమితం అవ్వడం, ప్రాధాన్యత ఇవ్వడం చేస్తున్నారు. అగ్రరాజ్యం అంటే - అక్కడ అధ్యక్ష స్థానానికి పోటీపడే అభ్యర్ధి అంటే "వామ్మో ఏ స్థాయిలో ఉంటారో" అని ఆలోచిస్తోన్న ప్రపంచానికి, ఇలా కూడా ఉంటారనే క్లారిటీ ఇవ్వడంలో మాత్రం ట్రంప్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
ఈ వివాదాస్పద వ్యాఖ్యల కొనసాగింపులో భాగంగా అమెరికా అధ్యక్ష పదవి రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రత్యర్థి - డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వారం జరిగిన రెండో ముఖాముఖి చర్చకు ముందు "హిల్లరీ డ్రగ్స్ తీసుకున్నారు" అని ఆరోపించిన ట్రంప్ తాజాగా మరోసారి ఆ విషయంపై స్పందించారు. మూడో ముఖాముఖి చర్చకు ముందు హిల్లరీకి - తనకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. "అథ్లెట్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తారు.. హిల్లరీకి - నాకూ కూడా ముఖాముఖి చర్చకు ముందు ఈ పరీక్షలు నిర్వహించాలి.. ఆమె ప్రవర్తన నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు" చెప్పారు ట్రంప్. ఈ విషయంలో సవాల్ విసురుతోన్న ట్రంప్... తాను డ్రగ్ పరీక్ష చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, హిల్లరీ కూడా సిద్ధం కావాలని అంటున్నారు.
ఆ డ్రగ్స్ సంగతి అలా ఉంటే... ఇప్పటికే లైంగిక వేదింపుల ఆరోపణల్లో రికార్డు సృష్టించిన ట్రంప్ పై మరో ఇద్దరు మహిళలు కొత్త ఆరోపణలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ టీవీ షో "ది అప్రెంటీస్"లో పాల్గొన్న సమ్మర్ జెర్వోస్ - మాజీ మోడల్ క్రిస్టీన్ ఆండర్సన్ తమను ట్రంప్ లైంగికంగా వేధించాడని - అసభ్యంగా ప్రవర్తించాడని మీడియా ముందుకు వచ్చారు. వీరిలో సమ్మర్ జెర్వోస్... "2007లో ట్రంప్ ను ఉద్యోగం విషయంలో కలిశాను, అప్పుడు నన్ను డిన్నర్ కు పిలిచిన ట్రంప్ రెస్టారెంట్ కు రమ్మనకుండా అతడి బంగ్లాకు పిలిపించాడు, ఆ సమయంలో నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఛాతీపై చెయ్యి కూడా వేశాడు" అని ఆరోపించగా... 1990ల్లో ఓ నైట్ క్లబ్ లో తాను మినిస్కర్ట్ ధరించి ఉండగా ట్రంప్ తనను చాలా అభ్యంతరకరంగా తాకాడని క్రిస్టీనా ఆండర్సన్ ఆరోపించారు.
ఇక్కడ మరో విషయం ఉంది... ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఖండిస్తున్నాననో లేక వారిపై చట్టపరంగా పోరాడతాననో, పరువునష్టం దావా వేస్తాననో చెప్పాల్సింది పోయి మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ట్రంప్ కే సాధ్యమేమో! తనపై ఆరోపణలు చేసిన మహిళలపై తాజాగా స్పందించిన ట్రంప్... "నాపై ఆరోపణలు చేస్తోన్న ఆ ఇద్దరు అసలు నా దృష్టి పెట్టేంత ఆకర్షణీయంగా ఏమీ లేరు" అన్నారు. దీంతో... ఆకర్షణీయంగా ఉంటే మీ చేతులకు పనిచేప్పేవారేనా, అలాంటి పనులు చేసేవారేనా అనే ప్రశ్నలు యదావిదిగా ఎదురవుతున్నాయి!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/