Begin typing your search above and press return to search.

ఆ నియంతకు ఈ వాగుడుకాయ చెక్ చెబుతారా?

By:  Tupaki Desk   |   24 March 2016 5:06 AM GMT
ఆ నియంతకు ఈ వాగుడుకాయ చెక్ చెబుతారా?
X
నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ.. ప్రపంచ దృష్టిని​ ఆకర్షించే​ వాగుడుకాయ ఒకరు. తన చేతలతో ప్రపంచానికి వణుకు పుట్టించేదొకరు. మరి.. ఈ ఇద్దరూ ఒకరికొకరన్నట్లు తలపడితే పరిస్థితేంది? ఊహించేందుకే ఇబ్బందిగా ఉండే ఇలాంటి పరిస్థితి అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ఇద్దరూ మరెవరో కాదు.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కమ్ నియంత కిమ్ జాంగ్ .. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి అధ్యక్షుడు కావాలని తపిస్తున్న ట్రంప్.

ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా ఉండే వీరి మధ్య ముఖాముఖి పోరాటం మొదలైతే.. పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చర్చ అంతా అమెరికాలో జరుగుతుంటే.. ఉత్తరకొరియాలో అసలు ఈ అంశం గురించి పెద్దగా మాట్లాడుకోవటం లేదట. ఆగ్ర రాజ్యాల మాటను ఏ మాత్రం వినకుండా తనదైన రీతిలో వరుస అణు పరీక్షల్ని నిర్వహిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు.. అవసరమైతే.. అమెరికాను తమ ఆయధాలతో నాశనం చేస్తాననే మాటకు తెగబడటం తెలిసిందే. అమెరికా పొడ ఏ మాత్రం గిట్టని కిమ్ జాంగ్ కు.. ట్రంప్ కానీ అమెరికా అధ్యక్షుడిగా మారితే పరిణామాలు దారుణంగా ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ట్రంప్ కానీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఉత్తర కొరియా​ ​అధ్యక్షుడి​కి ముకుతాడు వేయటమే కాదు.. అతగాడ్ని మట్టుబెట్టేందుకు సైతం ప్రయత్నాలు చేస్తారన్న వాదన జోరందుకోవటం గమనార్హం. ఈ నేతల మధ్య పోరు ప్రపంచం ముందు ఎలాంటి పరిణామాల్ని తీసుకొస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్న వారు లేకపోలేదు. తాను వ్యతిరేకించే వారందరికీ అడ్డుగోడలు కడతానని.. ఐఎస్ ను సమూలంగా నాశనం చేస్తానని చెబుతున్న ట్రంప్.. ఉత్తర కొరియా అధ్యక్షుడ్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరన్న మాట అమెరికన్లలో బలంగా వినిపిస్తోంది. మరి.. ఈ ఇద్దరి మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతుందా? లేదా? అన్నది అమెరికన్లు ఇచ్చే తీర్పుతోనే ముడిపడి ఉండనుంది.