Begin typing your search above and press return to search.
మీడియా తో చిట్ చాట్: మోదీకి ట్రంప్ ఝలక్ ఇచ్చాడా?
By: Tupaki Desk | 26 Feb 2020 8:33 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ భారతదేశంలో రెండు రోజుల పర్యటన చేశారు. సోమ - మంగళవారాలు అహ్మదాబాద్ - ఆగ్రా - ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనను ట్రంప్ విహార యాత్రగా భావించినట్టు తెలుస్తోంది. అంతేకానీ విశేష ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన వైఖరితో తెలిసింది. ఎందుకంటే ఈ పర్యటనపై భారతదేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా భావించి సకల సౌకర్యాలు - రాచ మర్యాదలు కల్పించారు. మోదీతో సన్నిహితంగానే వ్యవహరించిన ట్రంప్ విధానపరమైన నిర్ణయాలు, ఒప్పందాలతో మొండిచేయి చూపగా.. చివరకు వెళ్లేమందు సాయంత్రం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అవి పరోక్షంగా ఝలక్ ఇచ్చినట్లు వాటిని పరిశీలిస్తే తెలుస్తోంది.
అమెరికా నుంచి కొన్ని హామీలు.. కొన్ని రకాల ప్రకటనలను భారత్ ఆశిస్తుంది. అలాంటివేమీ రాకపోకగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలను పరోక్షంగా వాటిని ప్రస్తావిస్తూనే విమర్శించారు. విలేకరుల సమావేశంలో ట్రంప్ చేసిన పలు వ్యాఖ్యలు నరేంద్ర మోదీని ఇరకాటంలో పడేలా చేశాయి.
ప్రధానంగా పౌరసత్వ సవరణ చట్టం - కాశ్మీర్ విభజన - 370 రద్దు వంటి వ్యవహారాలపై అమెరికా వైఖరి ఎలా ఉంటుందోనని అందరూ ఎదురుచూశారు. అందుకనుగుణంగా మీడియా సమావేశంలో ప్రశ్నలు మొదలయ్యాయి. సీఏఏపై ట్రంప్ స్పష్టమైన నిర్ణయం ప్రకటించారు. సీఏఏ అనేది పూర్తిగా భారత అంతర్గత వ్యవహారం అని ట్రంప్ సెలవిచ్చారు. దీంతో పాటు భారత్ లో పూర్తి మతస్వేచ్ఛ ఉందని గుర్తుచేశారు. అయితే కాశ్మీర్‌తో సంబంధాల విషయంలో కూడా ట్రంప్ స్పందించారు. ఇది భారత్ అంతర్గత వ్యవహారమని చెబుతూనే రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. దీంతో నరేంద్రమోదీకి ఝలక్ ఇచ్చినట్టయ్యింది. ఎందుకంటే కశ్మీర్ వ్యవహారంలో మొదటి నుంచి ఇతర దేశాల ప్రమేయాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో మధ్యవర్తిత్వం వహిస్తామని ట్రంప్ ప్రకటించడం మింగుడ పడని విషయం.
దీంతో పాటు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను సడలించడానికి.. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధమని తన గతం మాటనే మళ్లోసారి చెప్పాడు. ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి తమ ప్రజలను రక్షించుకోవడానికి భారత్, అమెరికాలు రెండూ కలిసి పని చేస్తాయన్న ట్రంప్ తెలిపారు. అయితే అదే సమయంలో సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి పాకిస్తాన్ చాలా కృషి చేస్తోందని ప్రకటించడం గమనార్హం.
ప్రఫంచంలో ఏ ఇతర దేశం యొక్క మధ్యవర్తిత్వాన్నీ భారత్ కోరుకోవడం లేదు. ఈ విషయాన్ని మోడీ గతంలోనే పలుమార్లు స్పష్టం చేసినా ట్రంప్ మళ్లీ అదే మాట చెప్పడంతో భారత్ ఇరకాటంలో పడింది. ఇదే సమయంలో 370 రద్దు చట్టం రద్దు గురించి ట్రంప్ అసలే స్పందించలేదు. ట్రంప్ పర్యటనను అసాంతం పరిశీలించగా ఆయన విహారయాత్రగా వచ్చినట్టు కనిపిస్తోంది. అంతేగానీ అమెరికా భారతదేశంపై వైఖరి మారలేదని, పాకిస్తాన్ తో సత్సంబంధాలు పెంచుకుంటూనే భారత్ తో కలిసి పని చేస్తామని ట్రంప్ గతంలో పాడిన పాటనే మళ్లీ పాడాడు.