Begin typing your search above and press return to search.
కొరియా కోసం చైనా రిక్వెస్ట్...ట్రంప్ ఫైర్
By: Tupaki Desk | 29 Dec 2017 1:44 PM GMTఉత్తరకొరియాతో అమెరికా తదితర దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలను సర్దుబాటు చేసేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని చైనా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఐరాస తమపై తాజా ఆంక్షలు విధించటంపై ఉ.కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో చైనా ఈ విజ్ఞప్తి చేయటం విశేషం. మరోవైపు చైనా తీరు పట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రత్యేక ట్వీట్ చేశారు.
పదేపదే క్షిపణి పరీక్షలతో హడలెత్తిన్న ఉత్తర కొరియాకు ఇంధనం అమ్ముతున్న చైనాను ట్రంప్ తప్పుపట్టారు. చైనా వైఖరి తనను నిరుత్సాహాపరిచిందన్నారు. ఈ అంశాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఉత్తర కొరియాకు ఆయిల్ అమ్ముతూ చైనా దొరికిపోయిందని ట్రంప్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. చైనా నౌకలు ఉత్తర కొరియాకు ఇంధనం సరఫరా చేస్తున్న శాటిలైట్ ఇమేజ్ లను అమెరికా గుర్తించిందన్నారు. ఒకవేళ చైనా ఇలాగే వ్యవహరిస్తే, నార్త్ కొరియా సమస్యకు స్నేహపూర్వక పరిష్కారం దొరకదన్నారు.ఉత్తరకొరియా చైనా చమురును సరఫరా చేసిందని దక్షిణ కొరియా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని చైనా ప్రకటించింది. తమపై నిందలు వేయకూడదని చైనా తెలిపింది.
ఇటీవల ఉత్తరకొరియా నిర్వహించిన ఖండాంతర క్షిపణి ప్రయోగం నేపథ్యంలో ఆ దేశంపై తాజా ఆంక్షలు విధిస్తూ ఐరాస భద్రతా మండలి శుక్రవారం నాడు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ దేశం నుండి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై పరిమితులు విధించటంతో పాటు ఇతర దేశాలలో స్థిరపడిన ఉత్తరకొరియా పౌరులు నగదు పంపటంపై కూడా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ మీడియాతో మాట్లాడుతూ భద్రతా మండలి తీర్మానం ఉత్తర కొరియాపై ఇప్పటికే అమలులో వున్న ఆంక్షలను మరింత బలోపేతం చేస్తుంది కానీ సాధారణ ప్రజలపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపబోదని చెప్పారు. ఉ.కొరియాకు - ఇతర దేశాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు శాంతియుత పద్ధతులను అనుసరించాలని, ఉద్రిక్తతలు తగ్గించేందుకు అన్ని వర్గాలు చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వర్గాలూ సమయనం పాటించాలని - కొరియా ద్వీపకల్పంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సర్దుబాటు చేసేందుకు సానుకూలమైన - నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని తాము కోరుతున్నట్లు ఆమె చెప్పారు. భద్రతా మండలి విధించిన తాజా ఆంక్షలను ఉత్తర కొరియాకు మిత్రదేశాలుగా ఉన్న చైనా - రష్యా బలపర్చటం విశేషం.
ఉత్తరకొరియా ఇటీవలి కాలంలో వరుసగా నిర్వహించిన అణ్వస్త్ర - క్షిపణి పరీక్షలతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అణు - క్షిపణి పరీక్షల విషయంలో సంయమనం పాటించాలంటూ తాము పలుమార్లు చేసిన విజ్ఞప్తులను బేఖాతరు చేయటంపై భద్రతా మండలి ఐరాసపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఉ.కొరియా - అమెరికా మధ్య మాటల యుద్ధం కూడా తారస్థాయికి చేరింది. సెప్టెంబర్ 3న తాము నిర్వహించిన అణు పరీక్ష తరువాత తమపై ఐరాస విధించిన ఆంక్షలను వెంటనే తొలగించాలని ఉ.కొరియా డిమాండ్ చేసింది. గత నెల 29న ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించామని - అమెరికా ప్రధాన భూభాగం మొత్తం తమ అణ్వస్త్రాల పరిధిలోకి వచ్చిందని ఉ.కొరియా ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఉ.కొరియాపై వత్తిడి పెంచటం ద్వారా సామరస్య పూర్వక పరిష్కార సాధనకు కృషి చేయాలని అమెరికా దౌత్యవేత్తలు సూచించారు.