Begin typing your search above and press return to search.
ఐరాస వేదికగా నవ్వులపాలైన ట్రంప్
By: Tupaki Desk | 27 Sep 2018 9:51 AM GMTఐక్యరాజ్య సమితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చేదు అనుభవం ఎదురైంది. తాజాగా జనరల్ అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగం నవ్వుల పాలైంది. ఆయన మాటలు వింటూ అందరూ గొల్లున నవ్వారు. అగ్రరాజ్య అధినేతనైన తనకు జరిగిన ఈ అవమానానికి ట్రంప్ బాగా నొచ్చుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ ప్రసంగం ప్రారంభం కాగానే సభలోని సభ్యులంతా బిగ్గరగా నవ్వారు. నిశ్శబ్దంగా ఉండటానికి బదులు గుసగుసలు ప్రారంభించారు. ఆపై ప్రసంగంలో భాగంగా ట్రంప్.. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో తాము సాధించిన అభివృద్ధిని అమెరికా చరిత్రలో ఏ యంత్రాంగమూ సాధించలేదని అన్నారు. దీంతో సభ్యులంతా గొల్లుమన్నారు. చాలాసేపటివరకు నవ్వు ఆపనే లేదు. ఊహించిన ఆ పరిణామానికి హతాశుడైన ట్రంప్.. ఒక్కసారిగా మూగబోయారు. ఆ వెంటనే తేరుకుని - తాను కూడా చిన్నగా నవ్వారు. ఇలాంటి స్పందన వస్తుందని ఊహించలేదు.. సరే కానీయండంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.
ఈ పరిణామంపై అమెరికా మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. మన దేశాధ్యక్షుడికి ఐరాసలో ఘోర అవమానం జరిగిందని, ఆయన ప్రసంగం నవ్వుల పాలైందని, ఇది దేశానికే ఘోర అవమానమని వార్తా సంస్థలు రాసుకొచ్చాయి. ఆ వార్తలపై కూడా ట్రంప్ స్పందించారు. సభాసదులు తనను చూసి నవ్వలేదని.. వారంతా తనతో మంచి సమయం గడిపారని ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు.