Begin typing your search above and press return to search.

గోడ గొడవలో ట్రంప్ వెనక్కి

By:  Tupaki Desk   |   8 Jan 2019 8:17 AM GMT
గోడ గొడవలో ట్రంప్ వెనక్కి
X
అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిగా వెనక్కి తగ్గారు. గోడ నిర్మాణంపై రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు మధ్య కోల్డ్ వార్ సాగింది. ఇందులో డెమోక్రాట్లదే పై చేయి అయినట్లు కనిపిస్తోంది. గోడకు బదులు స్టీల్ తో కంచె వేయాలని ట్రంప్ ప్రభుత్వం భావించింది.

గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తేనే ద్రవ్య వినియమ బిల్లును ఆమోదిస్తామని ఆయన పట్టుబట్టారు. అందుకు డెమోక్రాట్లు అంగీకరించకపోవడంతో పాక్షిక షట్ డౌన్ కొనసాగుతోంది. దీనికి స్వస్తి పలికేందుకు అమెరికా యంత్రాంగం డెమోక్రాటిక్ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుందని ట్రంప్ పేర్కొన్నారు.

ఇటీల నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలోనూ డెమోక్రాట్లు గోడ నిర్మాణానికి నిధుల కేటాయింపును వ్యతిరేకించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. కాంక్రిట్ గోడ కన్నా స్టీల్ కంచె ఏర్పాటుకే ఎక్కువ ఖర్చవుతుందని, కానీ పటిష్టంగా ఉంటుందని ట్రంప్ పేర్కొంటున్నారు. మొత్తానికి పాక్షిక షట్ డౌన్ తో వేలాది మంది ఫెడరల్ సిబ్బంది, కార్మికులు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో కాస్త ఊరట లభించింది.