Begin typing your search above and press return to search.
ట్రంప్ ను ఆడుకుంటున్న ఒబామా జడ్జీలు
By: Tupaki Desk | 17 March 2017 9:57 AM GMTతను అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ మీద మోజును బాహాటంగా చాటుకున్నారు. మీడియా తనమీద బూటకపు వార్తలు వెలువరిస్తోందని నిప్పులు కక్కా రు. ఈ సందర్భంగా సీఎన్ ఎన్ న్యూస్ చానెల్ ను నిందించారు. ఎబీసీ - సీబీఎస్ - ఎన్ బీసీ నెట్ వర్క్ లూ అంతేనని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా నెట్ వర్క్ అద్భుతమంటూ ఆకాశానికెత్తేశారు. ఫాక్స్‌న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ నిజాయితీ లేని మీడియాను దాటవేసేందుకు తనకు ట్విట్టర్ ఒక వేదికలా ఉపయోగపడుతుందని చెప్పారు. అసలు ట్విట్టర్ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాణ్ణే కాదు అన్నారు. అంటే తనను అధ్యక్షుడి చేసింది ట్విట్టర్ అని ఆయన మాటల సారాంశం!
ఇదిలాఉండగా....ముస్లిం దేశాల వలసలపై జారీచేసిన రెండో ఆదేశాలు కూడా ఇటు హవాయీ ఫెడరల్ జిల్లా కోర్టు - అటు మేరీల్యాండ్ కోర్టు కూడా తిరస్కరించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ఇది రాజకీయ తీర్పు అని దుయ్యబట్టారు. అప్పీలుకు వెళ్తామని స్పష్టంచేశారు. ఈ క్రమంలో ట్రంప్ ఈ తీర్పులను అసాధారణమైన రీతిలో విమర్శించారు. టెనెస్సీలోని నాష్ విల్ లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇదంతా న్యాయవ్యవస్థ అతిస్పందనలా కనిపిస్తున్నదని అభివర్ణించారు. ఈ తీర్పుల్లో రాజకీయం ఉందేమో అని సందేహాలు కూడా వ్యక్తం చేశారు. ఇది రాజకీయ తీర్పులా మీకు అనిపించడం లేదా అని సభకు హాజరైన జనాలను ఉద్దేశించి ట్రంప్ ప్రశ్నించారు. దానికి స్పందనగా సభలో జడ్జీలను గేలిచేస్తూ వెక్కిరింతలు వినిపించాయి. అమెరికా బలహీనంగా ఉన్నట్టు ఈ తీర్పుల ద్వారా సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఈ తీర్పులను రద్దు చేయించేందుకు ఎంతవరకైనా వెళ్తానని శపథం చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేస్తామని చెప్పారు. ఇద్దరు జడ్జీలు ఇదివరకటి ఒబామా సర్కారు ద్వారా నియమితులు కావడం గమనార్హం!
గత జనవరిలో అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ట్రంప్ ఇరాన్ - ఇరాక్ - యెమెన్ - సిరియా - లిబియా - సోమాలియా - సూడాన్ తదితర ఏడు దేశాల పౌరుల రాకపై నిషేధం విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులు కోర్టుల్లో వీగిపోయాయి. దీంతో ట్రంప్ ఈనెల ఇరాక్ ను - హెచ్1బీలను - ఇతర వీసాలను మినహాయిస్తూ సవరించిన ఫర్మానా జారీచేశారు. ఈ రెండో ఫర్మానా అమలు తేదీకన్నా ముందే కోర్టులో చతికిలబడింది. సవరించిన ఆదేశాల కూడా రాజ్యాంగ విరుద్ధంగానే ఉన్నాయి హవాయి ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది. ఒక మతాన్ని ప్రత్యేకించి లక్ష్యంగా చేసుకుని నిషేధం విధించడం అర్థరహితమని జడ్జి డెరిక్ వాట్సన్ ట్రంప్ సర్కారును మందలించారు. మేరీల్యాండ్ కోర్టు కూడా ఇదేరీతి తీర్పును వెల్లడించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రావాల్సిన ఈ ఫర్మానా దేశవ్యాప్తంగా ఎక్కడా అమలు కాకుండా ఫెడరల్ జిల్లా జడ్జి థియొడోర్ చువాంగ్ ఇంజంక్షన్ జారీ చేశారు. అమెరికా పౌర హక్కుల సంస్థ, వలస న్యాయ కేంద్రం ఉమ్మడిగా దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ ఆయన అమెరికా సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. రాకపోకలపై నిషేధం విధిస్తూ జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వులు ముస్లింలు రాకుండా అడ్డుకునేందుకు ఉద్దేశించినవేనని పిటిషనర్లు రుజువు చేయడం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. ఇలా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని నిషేధం విధించడం అమెరికా రాజ్యాంగంలోని మతస్వేచ్ఛ పరిరక్షణ హక్కును ఉల్లంఘించడమేనని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/