Begin typing your search above and press return to search.

తనలో ఉన్నది.. హిల్లరీలో లేనిది చెప్పాడు

By:  Tupaki Desk   |   12 July 2016 6:31 AM GMT
తనలో ఉన్నది.. హిల్లరీలో లేనిది చెప్పాడు
X
ఆసక్తికర వ్యాఖ్యలకు.. వివాదాస్పద మాటలకు కేరాఫ్ అడ్రస్ డోనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్న ఆయన్ను.. అధికారిక అభ్యర్థిగా ప్రకటించాల్సిన ప్రక్రియ ఒక్కటి మిగిలి ఉంది. తనను తప్ప మరెవరినీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించలేదన్న ధీమాతో తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ పోతున్నారు ట్రంప్. తాజాగా తన ప్రత్యర్థి.. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మీద పలు వ్యాఖ్యలు చేశారు ట్రంప్.

సహజంగానే మహిళలంటే చులకనభావం ఉన్నట్లుగా మాట్లాడే ట్రంప్ కు తన ప్రత్యర్థి హిల్లరీపై ఎటకారపు మాటలతో మండిపడటం మహా ఇష్టం. ఇప్పటికే ఆమెపై పలు ఆరోపణలు చేసిన ఆయన.. తాజాగా తనలో ఉన్నది.. హిల్లరీలో లేనివంటూ పలు విషయాల్ని చెప్పుకొచ్చారు. తానొక శాంతి భద్రతల అభ్యర్థినని.. హిల్లరీ క్లింటన్ ఈ విషయంలో బలహీనురాలిగా అభివర్ణించారు.

ప్రభావం చూపలేని.. భయం కలిగిన వ్యక్తిగా హిల్లరీని చెప్పిన ట్రంప్ తన మాటలకు సాక్ష్యమన్నట్లుగా.. ‘‘ఆమె ఒకప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల కోసం ప్రైవేటు ఈ మొయిల్స్ ను ఉపయోగించారు’’ అని చెప్పుకొచ్చారు. హిల్లరీ అబద్ధాలకోరన్న ట్రంప్.. తాను మాత్రం దయ కలిగిన వ్యక్తినని.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ నమ్మాలని చెప్పటం విశేషం. భద్రత కల్పించలేని దయ.. దయ అనిపించుకోదని.. భద్రత లేకుంటే ఏమీ లేనట్లేనన్న ఆయన.. డల్లాస్ కాల్పులను ప్రస్తావించారు. ఐదుగురు భద్రతాధికారుల మీద కాల్పులు జరగటాన్ని దేశాధ్యక్షుడిపై జరిగి దాఢిగా చెప్పుకొచ్చిన ఆయన.. ఇలాంటి అంశాల విషయంలో ప్రత్యేక కార్యాచరణ ఉండాలని చెప్పటం గమనార్హం. మరి.. ట్రంప్ ‘దయ’ మాటల్ని అమెరికన్లు ఎంతవరకూ నమ్ముతారో..?