Begin typing your search above and press return to search.
భారత్ హాట్ పిస్టల్ అంటున్న ట్రంప్
By: Tupaki Desk | 3 May 2016 6:15 AM GMTనిత్యం ఏదో ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసే డోనాల్డ్ ట్రంప్ తాజాగా భారత్ మీద భిన్న తరహా వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల తుది రేసులో అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆశిస్తున్న ఆయన.. నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం అలవాటే. నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో నానుతున్న ట్రంప్.. మొన్నటికి మొన్న చైనా తన అనుచిత వ్యాపార వైఖరితో అమెరికను రేప్ చేస్తోందని.. అలా అత్యాచారం చేసే అవకాశం తాను కానీ అధికారంలోకి వస్తే ఇవ్వనంటూ సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
తాజాగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియాలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ట్రంప్ తనకు భారత్.. చైనా.. మెక్సికో.. వియత్నాం.. జపాన్ దేశాలపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు. వివిధ దేశాల్ని ఒక సందర్భంలో తిట్టటం.. మరో సందర్భంలో పొగడటం.. కాస్తంత ఎటకారం చేయటం లాంటివి ట్రంప్ కి మామూలే. ఇప్పటికే భారత్ మీద.. భారత్ ఉద్యోగుల మీద పలు విమర్శలు చేసిన ట్రంప్.. ఈసారి భారత్ మీద విభిన్న వ్యాఖ్యలు చేశారు.
పేలటానికి సిద్ధంగా ఉన్న హాట్ పిస్టల్ గా భారత్ ను ట్రంప్ అభివర్ణించారు. విదేశాల నుంచి వచ్చిన విదేశీయుల కారణంగా అమెరికన్లు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నట్లుగా ట్రంప్ ధ్వజమెత్రు. తమ ఉద్యోగాల్ని కొల్లగొట్టటమే భారత్.. చైనా.. జపాన్ దేశీయుల పనిగా ట్రంప్ మండిపడ్డారు.