Begin typing your search above and press return to search.

నెటిజ‌న్ల ఫైర్‌: ట్రంపు.. కంపు ప‌నులు!

By:  Tupaki Desk   |   4 Oct 2017 8:45 AM GMT
నెటిజ‌న్ల ఫైర్‌: ట్రంపు.. కంపు ప‌నులు!
X
త‌న పాల‌న‌లో మెరుపుల క‌న్నా.. త‌న చేష్ట‌లు, వివాదాస్ప‌ద కామెంట్ల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచే అగ్ర‌రాజ్యం అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మ‌రోసారి వివాదాస్ప‌ద‌మ‌య్యారు. ఇటీవ‌ల వ‌రుస పెట్టి అమెరికా ప్ర‌జ‌లు క‌ష్టాల‌ను ఎదుర్కొంటున్నారు. తొలుత ఇర్మా తుఫాను, త‌ర్వాత మారియా పెను ఉప్పెన‌, ఇప్పుడు లాస్ వేగాస్ లో ఓ ఉన్మాది విచ‌క్ష‌ణార‌హిత కాల్పులు. వెర‌సి అగ్ర‌రాజ్యంలో ప్ర‌జ‌లు ఆత్మ‌ర‌క్ష‌ణ లేదా అని రోదిస్తున్నారు. వీరికి ధైర్యం చెప్పి ఓదార్చాల్సిన అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. త‌న వ్య‌వ‌హార శైలితో ఇటు బాధితుల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తుండ‌గా, అటు ప్ర‌పంచ దేశాల‌తో చీవాట్లు - విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. నిన్న‌టికి నిన్న అమెరికాలోని అత్యంత ర‌ద్దీ ప్రాంతం లాస్ వెగాస్‌ లో ఓ ఉన్మాది ప‌థ‌కం ప్ర‌కారం తుపాకితో రెచ్చిపోయాడు. దీంతో దేశ చ‌రిత్ర‌లోనే తొలి సారి ఘోరం జ‌రిగిపోయింది. మొత్తంగా 58 మంది చ‌నిపోగా, 512 మంది పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ కాల్పుల ఘ‌ట‌న ప్ర‌పంచ దేశాల‌ను సైతం కుదిపేసింది. అన్ని దేశాలూ మృతుల‌కు నివాళుల‌ర్పించాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అమెరికా అధ్య‌క్ష స్థానంలో ఉన్న ట్రంప్ మాత్రం వివాదాస్ప‌ద‌మ‌య్యారు. మృతుల‌కు త‌న‌ సంతాపం తెలియ‌జేస్తూ ఆయ‌న చేసిన ట్వీట్ వివాదాస్ప‌ద‌మైంది. అందులో ఆయ‌న వాడిన ప‌దాలు సంతాపాన్ని కాకుండా, ఆనందాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లుగా ఉండ‌టంతో నెటిజ‌న్లు మండిప‌డ్డారు.

ఆ త‌ర్వాత ప్యూర్టో రికోలో హ‌రికేన్ మ‌రియా బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ట్రంప్ వెళ్లారు. అక్క‌డ బాధితుల‌పైకి పేప‌ర్ ట‌వ‌ల్స్‌ ను విసిరారు ట్రంప్‌. ఈ ప‌రిణామం అన్ని వ‌ర్గాల్లోనూ నిప్పులు రాజేసింది. ఏదో టీవీ షోలో అవార్డులు ఇస్తున్న‌ట్లు పేప‌ర్ ట‌వ‌ల్స్‌ ను పంచ‌డం స‌బ‌బు కాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్త‌న్నారు. ప్ర‌పంచంలో అగ్ర‌రాజ్యంగా ఉన్న అమెరికా ప్రెసిడెంట్‌ కి క‌ష్ట‌కాలంలో ఉన్న‌ త‌న ప్ర‌జ‌ల‌కు క‌నీసం సంతాపం తెలియ‌జేయ‌డం కూడా రాద‌ని కామెంట్లు చేస్తున్నారు. ట్రంప్ వైఖ‌రి ప‌ట్ల తీవ్ర అసంతృప్తికి లోన‌యిన‌ట్లు ప్యూర్టో రికో బాధితులు కూడా చెప్పారు. మ‌రి ట్రంప్ ఎప్ప‌టికి మారేనో?!