Begin typing your search above and press return to search.

ట్రంప్ కు రాజీనామాల పంచ్ లు

By:  Tupaki Desk   |   28 Aug 2017 4:10 AM GMT
ట్రంప్ కు రాజీనామాల పంచ్ లు
X
వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరుకు బెదిరిపోతూ.. రాజీనామాలు చేసే వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇప్ప‌టికే ప‌లు బృందాలు ఆయ‌న దెబ్బ‌కు ద‌డిసి రాజీనామా చేసి వెళ్లిపోవ‌టం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి సైబ‌ర్ సెక్యూరిటీ బృందం కూడా చేరింది.

జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన విష‌యాల్లో.. మ‌రి ముఖ్యంగా సైబ‌ర్ సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం లేద‌ని ఆరోపిస్తూ ఏడుగురు స‌భ్యులున్న బృందం ఒక‌టి తాజాగా రాజీనామా చేసింది. ఇటీవ‌ల కాలంలో ట్రంప్ తీరును త‌ప్పు ప‌డుతూ రాజీనామా చేశారు. వారిలో ఆడ్మినిస్ట్రేష‌న్ డిసాల్డ్వ్ మ్యానిఫ్రాక్చ‌రింగ్ కౌన్సిల్.. స్ట్రాట‌జీ అండ్ పాల‌సీ ఫోర‌మ్ లు కూడా ఉన్నాయి. తాజాగా సైబ‌ర్ సెక్యూరిటీ బృందం కూడా చేర‌టం గ‌మ‌నార్హం.

నేష‌న‌ల్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అడ్వైజ‌రీ కౌన్సిల్ గా పిలిచే ఈ బృందం జాతీయ సైబ‌ర్ భ‌ద్ర‌త మీదా.. నిర్వ‌హ‌ణ లోపాల మీదా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. అమెరికా ప్ర‌జ‌లు అమితంగా ఆధార‌ప‌డే వ్య‌వ‌స్థ‌ల సైబ‌ర్ భ‌ద్ర‌త‌కు ముప్పు పెరిగిపోతుందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అలాంటి ప్ర‌భావం అధ్య‌క్ష ఎన్నిక‌ల్లోనూ క‌నిపించింద‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

తాజాగా రాజీనామా చేసిన బృందంలో భార‌తీయ మూలాలు ఉన్న ఒక డేటా ఇంజ‌నీర్ కూడా ఉన్నారు. దేశంలో జాతి విద్వేష హింసను అదుపు చేయ‌టంలో ట్రంప్ విఫ‌ల‌మ‌య్యార‌ని.. అదే ఈ బృందం రాజీనామా చేయ‌టానికి కార‌ణంగా చెబుతున్నారు. శ్రామికుల త‌ర‌ఫు అమెరికా సివిల్ వార్ లో పోరాడిన జ‌న‌ర‌ల్ రాబ‌ర్ట్ ఈలీ విగ్ర‌హాన్ని తొల‌గింపు ప్ర‌తిపాద‌న‌ను తాజా బృందం త‌ప్పు ప‌ట్టింది. మ‌రీ.. రాజీనామాల ప‌రంప‌ర‌కు ట్రంప్ ఏ విధంగా చెక్ చెబుతారో చూడాలి.