Begin typing your search above and press return to search.

వాటి త‌యారీని ఆప‌క‌పోతే ఆ దేశం భ‌స్మీప‌ట‌ల‌మే!

By:  Tupaki Desk   |   20 Sep 2017 5:34 AM GMT
వాటి త‌యారీని ఆప‌క‌పోతే ఆ దేశం భ‌స్మీప‌ట‌ల‌మే!
X
ప్ర‌పంచానికే పెద్ద‌న్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ హెచ్చ‌రిక‌ను జారీ చేశారు. ప్ర‌పంచ దేశాల సాక్షిగా తొలిసారి ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న ఉత్త‌ర‌కొరియాపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అదే ప‌నిగా అణ్వ‌స్త్ర క్షిప‌ణి పరీక్ష‌లు నిర్వ‌హిస్తూ ప్ర‌పంచ దేశాల్ని హ‌డ‌లెత్తిస్తోన్న ఉత్త‌ర కొరియా నియంత కిమ్‌కు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చారు. అమెరికా స‌హ‌నాన్ని ప‌రీక్షించొద్ద‌న్నారు.

ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు సేఫ్ గా ఉండే దేశాల్ని వెలి వేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న ఆయ‌న‌.. ఉత్త‌రకొరియాను స‌మూలంగా నాశ‌నం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంద‌ని ఆఖ‌రి వార్నింగ్ ఇచ్చేశారు. కిమ్‌ను రాకెట్ మ్యాన్‌గా అభివ‌ర్ణించిన ట్రంప్‌.. అణ్వ‌స్త్ర క్షిప‌ణుల త‌యారీని నిలిపివేయాల‌న్నారు.

2015లో ఇరాన్ తో అమెరికా చేసుకున్న అణు ఒప్పందం త‌మ దేశాన్ని ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో నెట్టేసింద‌న్న ఆయ‌న‌..అల్ ఖైదా.. హిజ్ బుల్‌.. తాలిబ‌న్ ఇత‌ర ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ఆర్థిక మ‌ద్ద‌తు ఇచ్చే దేశాల నిజ స్వ‌రూపాన్ని ప్ర‌పంచ దేశాల సాక్షిగా ఎండ‌గ‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు సాయం చేస్తుందంటూ వారం క్రితం పాకిస్తాన్ పై నిప్పులు చెరిగిన ట్రంప్ తాజాగా ఉత్త‌ర‌కొరియాకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేశార‌ని చెప్పాలి.

ఉత్త‌ర కొరియా ఎక్క‌డ అణు యుద్ధానికి దిగుతుందోన‌ని ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయ‌ని ఐక్య‌రాజ్య స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర‌స్ వ్యాఖ్యానించారు. ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం ముగిసిన త‌ర్వాత ప్ర‌పంచం ఇంత‌గా ఏ రోజూ ఆందోళ‌న ప‌డింది లేద‌ని.. కిమ్ కార‌ణంగా ప్ర‌పంచ ప్ర‌జ‌లంతా అణు ఆందోళ‌న‌ల‌కు గురి అవుతున్నార‌ని చెప్పారు. అమెరికా అధ్య‌క్షుడు ఇంత ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చిన నేప‌థ్యంలో ఉత్త‌ర కొరియా నియంత కిమ్ ఎలా రియాక్ట్ అవుతాడా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.