Begin typing your search above and press return to search.
ట్రంప్ కు ఆ విషయంలో ఇక ఓపిక లేదట
By: Tupaki Desk | 2 July 2017 10:15 AM GMTఅసలే తనదైన శైలిలో దూకుడుగా మొండి నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఓపిక నశిస్తే ఎలా ఉంటుంది? ట‌్రంప్ మామూలుగా తీసుకునే నిర్ణయాలే అనేక దేశాలను వణికించేస్తుంటే అసహనంలో తీసుకునే నిర్ణయాలు అల్లకల్లోలానికి దారితీయవచ్చు అంటారా?పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఉత్తరకొరియా పట్ల తమకు ఓపిక నశించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. విధ్వంసకర అణ్వాయుధాలు - క్షిపణుల పరీక్షలతో కయ్యానికి కాలుదువుతున్న ఆ దేశానికి గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరికలు చేశారు.
వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయ్ ఇన్ తో ట్రంప్ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంతో పాటు ఉత్తర కొరియా విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. అనంతరం సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ నియంతృత్వ పాలనలో మగ్గిపోతున్న ఉత్తరకొరియాలో ప్రజలకు భద్రత కరవైందని.. మానవత్వానికి విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఆ దేశంతో దౌత్యపరమైన చర్యలు జరిపే యోచనలో తాము లేమని ట్రంప్ తేల్చిచెప్పారు. అందుకు దక్షిణ కొరియాతో సంయుక్తంగా ముందుకెళ్లనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఉత్తర కొరియాకు బద్ధ శత్రువైన దక్షిణ కొరియాలో పర్యటించేందుకు ట్రంప్ అంగీకరించినట్లు మూన్ జాయ్ వెల్లడించారు. ఉత్తరకొరియా విషయంలో కార్యాచరణ గురించి మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు.
కాగా, అమెరికాకు చెందిన ఓ విద్యార్ధిని ఉత్తరకొరియా 18నెలల పాటు నిర్బంధించడం.. కోమాలోకి వెళ్లిన అతను అమెరికాలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే మృతి చెందడం ఇటీవల తీవ్ర సంచలనం రేపింది. దాంతో ఇప్పటికే అంటీముట్టనట్టుగా ఉండే ఈ రెండు దేశాల మధ్య వైరం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియాపై ట్రంప్ మరింత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ప్రకటన నేపథ్యంలో ట్రంప్ ఏం చేయనున్నారనే ఆసక్తి అన్నివర్గాల్లో నెలకొంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/