Begin typing your search above and press return to search.

మ‌న‌దగ్గ‌రే కాదు.. అమెరికాలోనూ మీడియా ప‌రిస్థితి ఇంతే.. ప‌రువున‌ష్టం దావా!

By:  Tupaki Desk   |   4 Oct 2022 10:39 AM GMT
మ‌న‌దగ్గ‌రే కాదు.. అమెరికాలోనూ మీడియా ప‌రిస్థితి ఇంతే.. ప‌రువున‌ష్టం దావా!
X
భార‌త్‌లో మీడియాకు స్వేచ్ఛ లేదు.. అనే మాట త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంది. ఇక‌, ఏపీలో అయితే.. ఇటు మీడియా..అటు సోష‌ల్ మీడియా రెండింటిపైనా.. సర్కారు ఉక్కుపాదం మోపుతోంద‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే.

వాస్త‌వాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు సైతం.. దీనిని నిజ‌మేన‌ని అంటున్నారు. అయితే.. స్వేచ్ఛ‌కు.. ముఖ్యంగా భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు పెద్ద‌గొడుగు ప‌ట్టే అమెరికాలోనూ.. ఇప్పుడు మీడియాకు స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి.

తాజాగా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ఓ మీడియాపై వేల కోట్ల రూపాయ‌ల ప‌రువును న‌ష్టం దావా వేశా రు. అగ్ర‌రాజ్యానికి అధ్య‌క్షుడిగా చేసిన‌వ్య‌క్తి ఇలా మీడియాపై ప‌రువు న‌ష్టం దావా వేయ‌డం.. అనేది ప్ర‌పంచ చ‌రిత్ర‌లో ఇదే తొలి సార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో ఈ వార్త ఇప్పుడు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆస‌క్తిగా మారింది.

ఏం జ‌రిగిందంటే..

అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్ నెట్‌వర్క్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తన పరువుకు CNN నెట్‌వర్క్‌ భంగం కలిగించిందని, అందుకు 475 మిలియన్ డాలర్లు(సుమారు 3వేల900 కోట్ల రూపాయలు) పరిహారం కోరుతూ దావా వేశారు. ఈ మేరకు 29 పేజీలతో కూడిన దావాను ట్రంప్‌ తరఫు న్యాయవాదులు ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్‌ కోర్టులో సమర్పించారు.

తనను ఒక పెద్ద మోసకారిగా సీఎన్ఎన్ చిత్రీకరిస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. 2021 జనవరి నుంచి 7వేల 700సార్లు తనను అబద్ధపు మోసకారిగా ఆ మీడియా సంస్థ అభివర్ణించిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని భయపడి.. ఇటీవల తనపై సీఎన్ఎన్ దాడిని పెంచిందని ఆరోపించారు.

సీఎన్ఎన్పై ట్రంప్ గతంలో అనేక సార్లు ఇలాంటి ఆరోపణలే చేశారు. తనకు వ్యతిరేక వైఖరి అవలంబి స్తుందని చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో సీఎన్ఎన్ను పదేపదే "క్లింటన్ న్యూస్ నెట్వర్క్"గా అభివర్ణించేవారు ట్రంప్. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని అర్థం వచ్చేలా ఈ విమర్శలు చేసేవారు. అయితే.. తాజా ప‌రిణామాల‌పై ప్ర‌పంచ మీడియా ట్రంప్‌ను ఏకేస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.