Begin typing your search above and press return to search.
ఇలాంటోడు అమెరికా అధ్యక్షుడు అయితే..?
By: Tupaki Desk | 4 March 2016 9:25 AM GMTనోరు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదు. ఇక.. ప్రపంచానికే పెద్దన్న స్థానంలో ఉండే వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి. చపలచిత్తానికి కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరిస్తూ.. తనకు నచ్చనోళ్ల మీదా ఇష్టారాజ్యంగా మాట్లాడేసే డోనాల్డ్ ట్రంప్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫు తుది బరిలో దిగాలన్న ఆశతో ఉన్న ట్రంప్ తాజాగా తన పార్టీకి చెందిన ప్రత్యర్థి అభ్యర్థిపై చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష స్థానం కోసం పోటీ పడే వ్యక్తి మరీ ఇంత దిగజారి వ్యాఖ్యలు చేస్తారా? అని ముక్కున వేలేసుకునే పరిస్థితి. తన ప్రత్యర్థి రుబియోతో జరిగిన సంవాదంలో అతగాడిపై వ్యక్తిగత విమర్శలు చేయటమే కాదు.. చులకన భావంతో చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. పురుషాంగం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడటం సంచలనం సృష్టిస్తోంది. ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు విన్నోళ్లంతా ఇలాంటోడు కానీ అమెరికా అధ్యక్షుడు అయితే అమెరికా పరువు బజారున పడటమే కాదు.. అమెరికన్ రాజకీయ నేతలు బఫూన్లుగా ప్రపంచం ముందు మారటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.