Begin typing your search above and press return to search.
జై ట్రంప్ ..జైజై ట్రంప్ .. ట్రంప్ తన భక్తుడిని కలుస్తారా !
By: Tupaki Desk | 20 Feb 2020 12:30 AM GMTప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్ పేరు మారుమోగిపోతుంది. రెండ్రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈ నెల 24న ట్రంప్ తొలిసారిగా ఇండియాకు రానున్నారు. అయితే , ఇదే సమయంలో ఇండియా లో ఉన్న ట్రంప్ భక్తుడి విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అతనికి ట్రంప్ అంటే అమితమైన ఇష్టం ..ఎంతలా అంటే ..మాములుగా ఎవరైనా దేవుడికి పూజలు చేస్తారు.. కానీ అతను మాత్రం ట్రంప్‌కి పూజలు చేస్తుంటాడు. ట్రంప్ మీద ఉన్న అభిమానంతో ట్రంప్ కు తన ఇంటి ఎదుటే గుడికట్టి మరీ పూజచేస్తుంటాడు ఆ భక్తుడు..భారత్ కి వచ్చినప్పుడు నిన్ను కలుస్తా అని 2019 జూన్ 14 న సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. కానీ , అప్పటినుండి అయన ఇండియాకి రాలేదు.
కానీ , ట్రంప్ ఇండియా పర్యటన మరికొద్దిరోజుల్లోనే ప్రారంభం కాబోతుండటంతో ..ఈ వీరాభిమాని మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఆ వీరాభిమాని గురించి కొన్ని విషయాలని చూస్తే .. అతనిది జనగామ జిల్లా భచ్చన్నపేటలోని కొన్నే గ్రామం. ఇతని పేరూ కృష్ణ అలియాస్ క్రిష్.. తన ఇంటివద్ద కిరాణ దుకాణం నడుపుకుంటూ, వ్యవసాయం సాగు చేస్తుంటాడు. రెండేళ్ల క్రితం నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వీరాభిమానిగా మారాడు. ఎందుకని ప్రశ్నిస్తే ట్రంప్ వ్యవహారశైలి, ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఈయనకు విపరీతంగా నచ్చాయట.
దీంతో తన ఇంట్లో ట్రంప్ కు పూజా మందిరాన్ని నిర్మించి.. ట్రంప్ ఫోటోకు నిత్యపూజలు, అభిషేకాలు, హారతులు ఇస్తాడు. నిత్యం అయన ఇంట ట్రంప్ నామస్మరణే వినిపడుతుంటుంది. తన ఇంటిముందు ట్రంప్ విగ్రహాన్ని స్థాపించిన కృష్ణ… గతయేడాది ట్రంప్ జన్మదినం సందర్బంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి సంబరాలు కూడా జరుపుకున్నాడు. అలాగే ట్రంప్ ఫోటోకు ఫ్రేమ్ కట్టించి నిత్యపూజలు చేస్తూ.. జై ట్రంప్.. జైజై ట్రంప్ అంటూ నిత్యం భజన కూడా చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ట్రంప్ వందకోట్ల మంది బారతీయులలో క్రిష్ ఒక్కడే తనకు స్పెషల్ అని అప్పట్లో చెప్పారు. అయితే , ప్రస్తుతం ఇండియాలో ట్రంప్ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఎలాగైనా ట్రంప్‌ను కలవాలని ఈ భక్తుడు ఆశపడుతున్నాడు. చూడాలి ఈ భక్తుడికి ఆ భగవంతుడిని కలుసుకునే అవకాశం వస్తుందో రాదో మరి చూడాలి.