Begin typing your search above and press return to search.
ట్రంప్ ఎఫెక్ట్ః ఐఐటీయన్లకే ఉద్యోగాలు దక్కట్లే
By: Tupaki Desk | 13 Dec 2016 4:19 AM GMTదేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటి విద్యాలయాల్లోనూ అంతర్జాతీయంగా ఈ ఏడాది ఉద్యోగావకాశాలు బాగా తగ్గిపోయినట్టు ఆయా సంస్థలకు చెందిన శిక్షణ-ఉద్యోగాల కల్పన వర్గాలు పేర్కొన్నాయి. ఐఐటి రూర్కీలో 77 శాతం - ఐఐటి మద్రాస్ లో 54 శాతం - ఐఐటి ఖారగ్ పూర్ లో 44 శాతం - ఐఐటి గౌహతీలో 18 శాతం మేర అవకాశాలు తగ్గినట్టు ఆ వర్గాలు చెప్పాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా వీసా మంజూరు విషయంలో కాబోయే అధ్యక్షుడు ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా అందుకు కారణమని ఆ వర్గాలు విశ్లేషించాయి.
అంతర్జాతీయంగా డిసెంబర్ 1నుంచి తుది ఎంపిక ప్రారంభిస్తారు. అయితే, కంపెనీల్లో ఎక్కువభాగం భారత్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, అదే పని కోసం విదేశీ అవకాశాలు ఎందుకు కల్పిస్తారని ఐఐటీ రూర్కీలో శిక్షణ-ఉద్యోగాల కల్పన ఇంఛార్జ్ ప్రొఫెసర్ ఎన్ పి పాధీ అన్నారు. రూర్కీ నుంచి గతేడాది 30మందికి అవకాశాలు రాగా - ఈసారి ఏడుగురికే పరిమితం కావడం గమనార్హం. ఈ క్యాంపస్ నుంచి ప్రతియేటా కనీసం ఐదారుగురికి అవకాశాలు కల్పించే మైక్రోసాఫ్ట్ ఈసారి ఒక్కరినే తీసుకున్నది. ఐఐటీ ఇంజినీరింగ్ విషయంలో ఈ ఏడాది తమ సంస్థ పరిశోధన - అభివృద్ధిపై దృష్టి సారించినట్టు మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, అంతర్జాతీయ అవకాశాలు సన్నగిల్లడంపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. గతంలో అంతర్జాతీయ అవకాశాలిచ్చిన ఫుజి లాజిక్స్ - వరల్డ్ క్వాంట్ - వర్క్స్ అప్లికేషన్స్ వంటి సంస్థలు కూడా ఈసారి బాగా తగ్గించాయి లేదా కొన్ని క్యాంపస్ ల్లో అసలు నియమాకాలే చేపట్టలేదు.
అయితే, గతంలో అమెరికాలో అవకాశాలిచ్చిన ఫుజి లాజిక్స్ ఈసారి ఆమేరకు ఇక్కడే ఉద్యోగాలిచ్చినట్టు ప్రొఫెసర్ పాధీ తెలిపారు. మైక్రోసాఫ్ట్ - ఒరాకిల్ - స్ప్రింక్లర్ - ఎన్ టిటి కమ్యూనికేషన్స్ వంటి సంస్థల నుంచి ఐఐటి ఖరగ్ పూర్ విద్యార్థులకు గతేడాది 15-16 అవకాశాలు లభించగా - ఈసారి తొమ్మిదికే పరిమితమయ్యాయి. ఐఐటి మద్రాస్ కు గతేడాది 13 రాగా - ఈసారి 6 అవకాశాలు మాత్రమే దక్కాయి. ఈ ఏడాది ఐఐటి హైదరాబాద్ మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలిచింది. గతేడాది ఇక్కడ 13మందికే అవకాశాలు దక్కగా, ఈసారి ఆ సంఖ్య 16కు పెరిగింది. జపాన్ కంపెనీలైన యాహూ జపాన్ - ఎస్ ఎంఎస్ - రకూటెన్ లు తమ క్యాంపస్ కు ప్రాధాన్యతనిచ్చాయని ఐఐటి హైదరాబాద్ లో శిక్షణ - ఉద్యోగాల కల్పన ఇంఛార్జ్ బి.వెంకటేశం తెలిపారు. అమెరికా - యూరప్ నుంచి తమకు అవకాశాలు రాలేదని ఆయన చెప్పారు. ఐఐటి బాంబేకు కూడా గతేడాదిలాగే ఈసారి 40 అంతర్జాతీయ నియామకాలు దక్కాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/