Begin typing your search above and press return to search.
మూడు దేశాల పర్యటనలో మోడీ యాంగిల్స్ ఎన్నో
By: Tupaki Desk | 28 Jun 2017 5:30 PM GMTప్రధాని మోడీలో కనిపించినన్ని యాంగిల్స్ చాలామంది దేశాధినేతల్లో అస్సలు కనిపించవు. ఆయన ఏ దేశానికి వెళ్లినా ఆ దేశస్తులతో ఒదిగిపోవటమే కాదు.. అక్కడి వారిని ఫిదా చేసి రావటం ఆయనకు అలవాటు. తాజాగా మూడు దేశాల పర్యటనకు వెళ్లిన ఆయన.. తన ట్రిప్ ను ఎంత ఘనంగా ముగించుకు వచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
పేరుకు మూడు దేశాల పర్యటనే అయినా.. అందరి ఫోకస్ మాత్రమే అమెరికా పర్యటన మీదనే ఉంది. అందులోకి అమెరికా అధ్యక్షుడు తెంపరి ట్రంప్ ను మోడీ ఎంతలా మెస్మరైజ్ చేస్తారన్న ఆసక్తి వ్యక్తమైంది. అంచనాలకు మించిన ఎమోషన్ ను మోడీ పట్ల ట్రంప్ ప్రదర్శించారనే చెప్పాలి.
తోపుల్లాంటి అగ్రరాజ్యాధినేతలు వస్తే.. వారికి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి.. ఇచ్చినా వారిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించే ట్రంప్.. మోడీ విషయంలో అలాంటి చిన్నెలు అస్సలు వేయలేదు. అంతకు మించి.. ఎప్పుడూ లేని విధంగా ఆయన భావోద్వేగంతో కొన్ని వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది.
మోడీ అమెరికా పర్యటన ఆసల్యమైందని.. అక్కడ కొన్ని రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల కారణంగా లేట్ అయ్యిందన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించటం.. నిజమైన స్నేహితుడంటూ వ్యాఖ్యానించటం లాంటివి చాలానే ఉన్నాయి. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లోనూ అదే వైనాన్ని ఆయన ప్రదర్శించారు.
వైట్ హౌస్ కు వచ్చిన మోడీతో 20 నిమిషాల ఏకాంత భేటీ కాస్తా 40 నిమిషాలు పొడిగించటం మొదలు.. పలుమార్లు కౌగిలింతలకు ఎలాంటి ఇబ్బంది పడకపోవటం.. వైట్ హౌస్ లో అసలైన స్నేహితుడు ఉంటాడని తాను ఎన్నికల సమయంలో చెప్పిన విషయాన్ని చేసి చూపిస్తున్నానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. మోడీతో పోలిస్తే.. తాజా ఎపిసోడ్ లో ట్రంప్ ఎక్కువ ఎమోషనల్ అయినట్లు కనిపిస్తుంది. వాస్తవానికి ఇలాంటివి మోడీ చేస్తుంటారు. కానీ.. అందుకు భిన్నంగా మోడీకి మించిన భావోద్వేగాన్ని ట్రంప్ ప్రదర్శించటం కనిపిస్తుంది. తన తాజా పర్యటనలో మిగిలిన దేశాలతో పోలిస్తే.. మోడీ అమెరికా పర్యటన మీదనే మీడియా సైతం ఎక్కువగా ఫోకస్ చేసిందని చెప్పక తప్పదు. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే.. ట్రంప్ మనసును మోడీ దోచుకోవటానికి కారణం.. ఆయనలోని వ్యాపారస్తుడ్ని.. రాజకీయ నాయకుడ్ని తనదైన శైలిలో సంతృప్తి పర్చటమే. తన తాజా పర్యటనలో భారీ వ్యాపార ఆర్డర్లు ఇవ్వటం ద్వారా ట్రంప్‌కు సంతోషాన్ని రెట్టింపు చేశారు. ఆ హ్యాపీని ట్రంప్ సైతం దాచుకోలేదు. భారత్ ఒప్పందం కారణంగా అమెరికాలో భారీగా ఉద్యోగ కల్పన జరగనుందని ఆయన వ్యాఖ్యానించటాన్ని మర్చిపోకూడదు. ఏతావాతా చెప్పేదేమంటే.. ట్రంప్ మనసును దోచుకోవటానికి ఎన్ని మార్గాలుఉన్నాయో అన్నింటిని అధ్యయనం చేసినట్లుగా మోడీ అప్లై చేసి.. ఆయన్ను ఫ్లాట్ చేసి తన దారిన తాను తిరిగి వచ్చారని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/