Begin typing your search above and press return to search.
దిగిపోతూ మరో షాకిచ్చిన ట్రంప్!!
By: Tupaki Desk | 3 Jan 2021 6:44 AM GMTదిగిపోతూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తన పంతం నెగ్గించుకుంటున్నారు. వర్క్ వీసాలు.. గ్రీన్ కార్డులపై అమెరికాకు వస్తున్న వలసదారులకు షాకులు ఇస్తున్నారు. ట్రంప్ తాజాగా ఈ ఏడాది మార్చి చివరి వరకు వలస దారులు అమెరికాకు రాకుండా నిషేధాన్ని పొడిగించారు.
డొనాల్డ్ ట్రంప్ గత ఏప్రిల్‌లో అమెరికాకు వచ్చే విదేశీయుల వర్క్ వీసాలపై నిషేధం విధించారు. జూన్‌లో కరోనావైరస్ తీవ్రంగా ప్రబలడంతో విధించిన లాక్ డౌన్ కారణంగా దేశంలో ఉద్యోగాలు కోల్పోకుండా అమెరికన్లను రక్షించే చర్యగా దీన్ని అభివర్ణించారు. అప్పుడు ఆయన జారీ చేసిన నిషేధాలు 2020 చివరి రోజుతో ముగుస్తున్నాయి. అయితే ట్రంప్ తాజాగా జనవరి 20న దిగిపోయే ముందు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ విదేశీ వర్కింగ్ వీసాలు మరో మూడు నెలల వరకు పొడిగించారు..
హెచ్1బీ - వీసాలు - ఇతర పని వీసాలు మరియు గ్రీన్ కార్డులపై అమెరికాకు రావాలనుకున్న వలసదారులకు ఈ నిషేధం వర్తిస్తుంది. ట్రంప్ అమలు చేసే ఈ వివాదాస్పద నిర్ణయాలను ఉపసంహరించుకుంటానని బిడెన్ వాగ్దానం చేసినప్పటికీ, జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇవన్నీ ఎంత త్వరగా ఉపసంహరిస్తాడన్నది ఎవరికి తెలియదు.
అంతకుముందు, ఫెడరల్ న్యాయమూర్తులు ట్రంప్ విధించిన వీసా నిషేధాన్ని రద్దు చేశారు. వ్యవసాయ కార్మికులకు ఇచ్చే హెచ్ -2 బి వీసాలు - వృత్తి నిపుణులైన జె -1 వీసాలు.. నిర్వాహకులు మరియు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే ఎల్ -1 వీసాలకు మాత్రం నిషేధం నుంచి వెసులుబాటు కల్పించారు.