Begin typing your search above and press return to search.
అదే ట్రంప్ చేతికి పవర్ వచ్చేలా చేసిందట
By: Tupaki Desk | 23 Jan 2017 6:02 AM GMTఆసక్తికరమైన రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. అందరూ అమితంగా ద్వేషించినట్లుగా కనిపించే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావటానికి.. ఆయన చేతిలో పవర్ రావటానికి కారణం ఏమిటన్న విషయంపై పరిశోధన చేసిన సంస్థ ఒకటి తాజాగా చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. ట్రంప్ చేతికి పవర్ రావటానికి కారణం ఆయన ముఖంగా చెబుతున్నారు. ట్రంప్ ముఖం తీరే ఆయనకు అధికారాన్ని కట్టబెట్టేలా చేసిందంటే బ్రిటీష్ శాస్త్రవేత్తలు లెక్కలు వేసి మరీ చెబుతుండటం విశేషం.
సిటీ యూనివర్సిటీ లండన్ లోని కాస్ బిజినెస్ స్కూల్ కు చెందిన సైంటిస్టులు ట్రంప్ ముఖ కవళికలపై పరిశోధన చేశారు. ట్రంప్ ముఖం మాదిరి పొడుగు.. వెడల్పు నిష్పత్తి ఎక్కువగా ఉండే వారికి పవర్ చేతికి వచ్చే అవకాశాలుఎక్కువగా ఉంటాయని తేల్చారు. ఒక వ్యక్తి స్త్రీ అయినా.. పురుషుడైనా.. వారి ముఖ నిర్మాణం తీరు వారిని లీడర్ ని అయ్యే అవకాశాల్ని ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని వారు చెబుతున్నారు.
ట్రంప్ కు మగతనం ఉట్టిపడే పొడుగు – వెడల్పుల నిష్పత్తి ఎక్కువగా ఉండే ముఖంతో పాటు.. వయసు ఉడిగిన ముఖకవళికలు ఉన్నాయని ఇలాంటి వారు నాయకులు అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉంటాయని తమ పరిశోధనల్లో తేలిందని వారు చెబుతున్నారు.
వాస్తవానికి ఇలాంటి వారికి మామూలుగా అయితే జనాలు ఓట్లు వేయరని.. ప్రస్తుతం ప్రపంచంలో అశాంతి ఉన్న నేపథ్యంలో ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారని వారు చెబుతున్నారు. ట్రంప్ ముఖాన్ని బట్టి ఆయన తీరును అంచనా వేసిన వారు.. ఆయన తీరు రెండు అంచుల కత్తి లాంటిదని.. దానికున్న అధిపత్య తీరుతో అమెరికాకు లాభం జరిగే వీలుందని చెబుతున్నారు. అయితే.. ఆయన చిర్రెత్తించే ధోరణి కారణంగా విదేశాంగ విధాన సంక్షోబానికి దారి తీసే అవకాశం ఉందని చెప్పటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/