Begin typing your search above and press return to search.
ట్రంప్ అట్టర్ ప్లాప్ అని తేలిపోయింది
By: Tupaki Desk | 5 Feb 2017 5:29 AM GMTఅయితే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం గత అధ్యక్షుల రికార్డులన్నిటినీ బద్దలు కొట్టారు. ఎలా అనుకొని ఆశ్చర్యపోకండి..అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన వ్యక్తి పట్ల ప్రజలు సహజంగానే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఆశలు ఆవిరై అతని పట్ల అవిశ్వాసం కలగడానికి వారాలు కాదు, నెలలు, సంవత్సరాలే పడ్తుంది. దాదాపుగా మాజీ అధ్యక్షులందరి విషయంలోను ఇది రుజువయింది.అధ్యక్షుడిగా గద్దెనెక్కిన కేవలం ఎనిమిందంటే ఎనిమిది రోజుల్లోనే మెజారిటీ ప్రజల అసంతృప్తిని ట్రంప్ మూటగట్టుకున్నారు. మెజారిటీ ఓటర్లు ఇప్పుడు తిరిగి బరాక్ ఒబామా అధ్యక్షుడిగా రావాలని కోరుకుంటూ ఉంటే ట్రంప్ ను అధ్యక్ష పదవినుంచి తొలగించాలని దాదాపు సగం మంది ఓటర్లు భావిస్తున్నారట.
తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో బరాక్ ఒబామా నాటి మంచి రోజులు కోల్పోయామని మెజారిటీ ప్రజలు భావించడానికి ఎక్కువ రోజులు పట్టలేదని, 52 శాతం మంది తిరిగి ఒబామా అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటుండగా, కేవలం 43 శాతం మందే ట్రంప్ అధ్యక్షుడిగా ఉండడం పట్ల సంతోషంగా ఉన్నట్లు తాజాగా తేలింది. ‘సాధారణంగా కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికయిన ఏ వ్యక్తికైనా సరే జనం మద్దతు బాగా ఉంటుంది. అధికారం చేపట్టిన తర్వాత కొంతకాలం వారికి ప్రజలనుంచి పెద్దగా వ్యతిరేకత ఎదురుకాదు. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ విషయంలో చరిత్ర సృష్టిస్తున్నారు. చెప్పుకోదగ్గ శాతంలో ఓటర్లు ఆయనను అభిశంసించాలని కోరుకుంటుండగా, బరాక్ ఒబామా తిరిగి అధ్యక్షుడు కావాలని మెజారిటీ ఓటర్లు భావిస్తున్నారు’ అని ఈ తాజా సర్వే నిర్వహించిన ‘పబ్లిక్ పాలసీ పోలింగ్’ సంస్థ అధ్యక్షుడు డీన్ డెబ్నమ్ అంటున్నారు. ట్రంప్‌ను అభిశంసించాలని 40 శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఇది 35 శాతమే ఉండగా ఇప్పుడు అది మరో 5 శాతం పెరిగింది. 48 శాతం మంది ఓటర్లు మాత్రమే ట్రంప్ ను అభిశంసించాలని తాము అనుకోవడం లేదని చెప్పారట. వలసలపై ట్రంప్ ఉత్తర్వుల విషయంలో మొత్తంమీద ఓటర్లు దాదాపు సమానంగా విడిపోయి కనిపించారని, 47 శాతం మంది దాన్ని సమర్థించగా, 49 శాతం మంది వ్యతిరేకించారని ఆ సర్వే పేర్కొంది. అయితే మొత్తం ప్యాకేజిని కాకుండా కేవలం ఎగ్జిక్యూటివ్ ఆదేశాల వరకు మాత్రమే చూసినట్లయితే దానికి ప్రజల మద్దతు లేదని స్పష్టమవుతోందని ఆ సర్వే తెలిపింది. ముస్లింలను నిషేధించే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు 52 శాతం మందిభావిస్తుండగా 41 శాతం మాత్రమే ఉద్దేశం అది కాదని భావిస్తున్నారట. అసలు ముస్లింలను నిషేధించాలనే ఆలోచనను అమెరికన్లు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుండడం గమనార్హం. 65 శాతం మంది ఆ ఆలోచనను వ్యతిరేకిస్తుండగా 26 శాతం మంది మాత్రమే సమర్థిస్తున్నారు.
ఇదెక్కడి విదేశాంగ విధానం
అమెరికాకు వ్యూహాత్మక భాగస్వాములయిన మెక్సికో - ఆస్ట్రేలియా దేశాల నేతలతో ట్రంప్ సుహృద్భావ ఫోన్ సంభాషణలు జరపలేదంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధానంపై ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘మెక్సికో అధ్యక్షుడు - ఆస్ట్రేలియా ప్రధానితో ట్రంప్ ఫోన్ సంభాషణల గురించి మీడియాలో వచ్చిన వార్తలు అమెరికన్లందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి’ అని అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రటిక్ పార్టీ విప్ స్టెనీ హెచ్ హోయెర్ అన్నారు. విదేశాంగ విధానం విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందనే దానికి ఇది మరింత బలం చేకూర్చడమే కాక, ప్రమాదకరమైన ముస్లిం నిషేధం దృష్ట్యా మన దేశ భద్రత పట్ల అమెరికన్లకున్న భయాలను మరింతగా పెంచుతుందని ఆయన అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/