Begin typing your search above and press return to search.
అమెరికా ఆయనకు..ఆయన బిజినెస్ లు పిల్లలకట
By: Tupaki Desk | 14 Nov 2016 9:46 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. తాజాగా విజయాన్ని ఎంజాయ్ చేస్తూ.. మరో రెండు నెలల వ్యవధిలోతాను చేపట్టాల్సిన అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంలో ఆయన పిల్లలు కూడా భాగస్వాములు అవుతారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే.. అలాంటి వాటిల్లో నిజం లేదని ట్రంప్ ఫ్యామిలీ మెంబర్లు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. తన పదవీ కాలంలో తాను ఎలాంటి జీతం తీసుకోనని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తాను గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.. తనకు అధ్యక్షుడిగా ఇచ్చే 4 లక్షల డాలర్లను తీసుకోనని.. తప్పనిసరైన పరిస్థితుల్లో ఏడాదికి ఒక డాలర్ కు అమెరికా అధ్యక్షుడిగా పని చేస్తానని చెప్పారు.
అంతేకాదు.. తన పదవీ కాలంలో తాను సెలువులు తీసుకోనని.. తాను చేయాల్సిన పని చాలానే ఉన్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. హెల్త్ కేర్.. పన్నులు తగ్గించే అంశంతో పాటు తాను దృష్టి సారించాల్సిన అంశాలు.. పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయన్నారు. తన ప్రాధాన్యత మొత్తం అమెరికాకే అని ట్రంప్ స్పష్టం చేస్తుంటే.. ఆయన కుమారుడు ఎరిక్.. కుమార్తె ఇవాంకలు మాత్రం తమ తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటామని చెబుతున్నారు.
తమ తండ్రికి సేవ చేసేందుకు కలిగిన అదృష్టగా అభివర్ణిస్తున్న వారు.. తాము న్యూయార్క్ లోనే ఉండి.. బిజినెస్ చూసుకుంటామని.. తండ్రి ట్రంప్ తలెత్తుకునేలా చేస్తామని చెబుతున్నారు. మొత్తానికి ట్రంప్ ఫ్యామిలీని చూస్తుంటే.. తండ్రి అమెరికాను చూసుకుంటానని చెబుతుంటే.. తండ్రి తగ్గ పిల్లలుగా.. తండ్రి వ్యాపారాన్ని తాము అంతే జాగ్రత్తగా చూస్తామని చెప్పటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/