Begin typing your search above and press return to search.

ఈసారి అత్యవసర పరిస్థితి.. హెచ్చరించిన ట్రంప్

By:  Tupaki Desk   |   27 Jan 2019 12:33 PM GMT
ఈసారి అత్యవసర పరిస్థితి.. హెచ్చరించిన ట్రంప్
X
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబ్ పేల్చాడు. మొన్నటి వరకు ప్రభుత్వాన్ని షట్ డౌన్ చేసి సంచలనం సృష్టించిన ట్రంప్, ఈసారి అవసరమైతే అత్యవసర పరిస్థితి విధించడానికి కూడా వెనకాడదని హెచ్చరించాడు. ఈ మొత్తం వివాదానికి కారణం అమెరికా-మెక్సికో మధ్య సరిహద్దు గోడ.

అమెరికాకు ప్రమాదకారిగా మారుతున్న మెక్సికో నుంచి సంబంధాలు తెంచాలంటే దేశానికి ప్రహరీ గోడ కట్టడం ఒక్కటే మార్గం అంటున్నారు ట్రంప్. ఈ మేరకు సెనేట్ లో తీర్మానం కూడా చేశారు. కానీ ఈ తీర్మానానికి అమెరికా కాంగ్రెస్ ఒప్పుకోలేదు. 570 కోట్ల బిలియన్ డాలర్లు కేవలం గోడ కోసం వెచ్చిస్తే, అమెరికా దివాలా తీస్తుందని కాంగ్రెస్ అభిప్రాయపడింది.

దీంతో కోపం తెచ్చుకున్న ట్రంప్ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేశారు. అలా నెలన్నర పాటు 8లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లేక అష్టకష్టాలు పడ్డారు. దీంతో కాస్త మెత్తబడిన ట్రంప్ తిరిగి ప్రభుత్వాన్ని పునరుద్ధరించారు. దీంతో ప్రతిపక్షాలతో పాటు ఓ సెక్షన్ మీడియా ఇది ట్రంప్ ఓటమి అంటూ హెడ్డింగ్ లు పెట్టాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన ట్రంప్.. గోడ కట్టాలనే ఆలోచన నుంచి వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే అత్యవసర పరిస్థితి ప్రకటించి మరీ గోడ కడతానని హెచ్చరించారు.