Begin typing your search above and press return to search.

ఆ దేశ ప్రధానిని తిట్టి.. కాల్ కట్ చేసిన ట్రంప్

By:  Tupaki Desk   |   2 Feb 2017 10:22 AM GMT
ఆ దేశ ప్రధానిని తిట్టి.. కాల్ కట్ చేసిన ట్రంప్
X
వివాదాలకు.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సంబంధించిన మరో కొత్త కోణం బయటకు వచ్చింది. ఇప్పటివరకూ అమెరికా నేతల్ని.. అమెరికాకు వ్యతిరేకంగా ఉండే వారితో పాటు.. మీడియాపై ఫైర్ అయ్యే ఆయన.. తాజాగా అమెరికాకు మిత్రదేశంగా.. సన్నిహిత సంబంధాలున్నట్లుగా చెప్పే దేశ ప్రధానికి ఫోన్ చేసి తిట్టేయటమే కాదు.. మధ్యలోనే కాల్ కట్టేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆస్ట్రేలియాకు.. అమెరికాకు మధ్యనున్న అనుబంధం కాస్త బలమైనదిగా చెబుతారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని మల్కం టర్న్ బాల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. సన్నిహిత దేశం కావటంతో.. ఇరు దేశాధినేతల మధ్య ఫోన్ సంబాషణ కనీసం గంట పాటు సాగుతుందని భావించారు. అందుకు భిన్నంగా అరగంటలోనే కాల్ కట్ చేసేసిన ట్రంప్.. ఆస్ట్రేలియా ప్రధానిపై ఫైర్ అయినట్లుగా చెబుతున్నారు.

వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన ఈ సంచలన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒబామాతో టర్న్ బాల్ చేసుకున్న శరణార్థుల ఒప్పందంపై ఇరు దేశాల అధినేతల మధ్య మాటలు జరిగాయని.. కాసేపటికే ట్రంప్ కు కోపానికి గురిచేయటంతో పాటు.. ఆస్ట్రేలియా ప్రధానిపై తీవ్రంగా దూషించినట్లుగా తెలుస్తోంది. ఒక సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానిని తీవ్రంగా మందలించిన ట్రంప్.. తన కోపాన్ని ప్రదర్శించే క్రమంలో కాల్ ను మధ్యలోనే కట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా ప్రధాని టర్న్ బాల్ ను స్పందించాలని కోరగా.. ఆయన రియాక్ట్ అయ్యేందుకునిరాకరించారు. ఇది పూర్తిగా ప్రైవేటు సంభాషణని.. దానిపై స్పందించలేనని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఆస్ట్రేలియా తీరప్రాంతంలో ఉన్న దాదాపు 1600 మంది శరణార్థులనుమార్చుకునేవిషయంలో ఆ మధ్యన ఒబామా సర్కారుతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది.

ట్రంప్ తాజా విధానాల నేపథ్యంలో.. ఒబామా హయాంలో జరిగిన ఒప్పందాన్ని గుర్తు చేయగా.. ట్రంప్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. తాను చేసిన కాల్స్ లో అతి చెత్త కాల్ గా ట్రంప్ అభివర్ణించినట్లుగా చెబుతున్నారు. శరణార్థుల విషయంలో ఆస్ట్రేలియా ప్రధాని వివరిస్తున్న సమయంలో ట్రంప్ రియాక్ట్ అవుతూ.. ‘‘మమ్మల్ని చంపేందుకు బోస్టన్ బాంబర్లను మరోసారి మాదేశంలోకి పంపాలనుకుంటున్నారా?’’ అంటూ తీవ్రస్వరంగా ట్రంప్ మాట్లాడినట్లుగా చెబుతున్నారు. తాను కానీ ఓకే అంటే అదో చెత్త డీల్ అవుతుందని తేల్చేసిన ట్రంప్.. కాల్ ను మధ్యలోనే కట్ చేసిన తన కోపాన్ని ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/