Begin typing your search above and press return to search.
ట్రంప్ కు పిచ్చ కోపం వచ్చేసింది..
By: Tupaki Desk | 12 Jan 2017 4:42 AM GMTమహా అంటే.. మరో తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే సమయం దగ్గర పడుతున్న వేళ.. అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన డోనాల్డ్ ట్రంప్ పై వస్తున్న తీవ్ర ఆరోపణలపై ఆయన స్పందించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిర్వహించినతొలి మీడియా సమావేశంలో ఆయన అగ్గి ఫైర్ అయ్యారు. తనపై వస్తున్న ఆరోపణల్ని కొట్టి పారేయటమే కాదు.. మీడియాపైనా చెలరేగిపోయారు.
ట్రంప్ కు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారం రష్యా వద్ద ఉందని.. ట్రంప్ విశృంఖల శృంగారానికి సంబంధించిన వివరాల్ని రష్యా సేకరించిందన్నది తాజా ఆరోపణ. దీనిపై ఇప్పటికే పలు కథనాలు అమెరికా మీడియాలో వచ్చాయి. వీటిపై ట్రంప్ సీరియస్ అయ్యారు. మీడియాలో వచ్చేదంతా చెత్తగా అభివర్ణించిన ఆయన.. తన ప్రతిష్టను దెబ్బ తీయటానికి జరుగుతున్న కుట్రగా అభివర్ణిస్తున్నారు.
ట్రంప్.. హిల్లరీలకు సంబంధించినసమాచారాన్ని సేకరించిన రష్యా.. వ్యూహాత్మకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో హిల్లరీకి సంబంధించిన వివరాల్నిబయటపెట్టారన్నది అమెరికా ఉన్నతాధికారి వాదన. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ వర్గీయులకు.. రష్యా మధ్య వర్తులకు మధ్య సమాచార మార్పిడి జరిగిందంటూ నిఘావర్గాలు వెల్లడించాయంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ట్రంప్ తాజాగా రియాక్ట్ అయ్యారు.
కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేవని.. అవన్నీ కట్టుకథలుగా కొట్టిపారేశారు. తనపై ఆరోపణలు చేయటం అవమానకరంగా అభివర్ణించిన ఆయన.. మానసిక రోగులు.. తనవ్యతిరేకులు చేసిన పనిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా సీఎన్ ఎన్ ప్రతినిధి ఒకరుప్రశ్న వేసే ప్రయత్నం చేయగా.. మీవన్నీ తప్పుడు వార్తలు.. రాసిందంతా చెత్త అంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఎవరూ తీసుకురాలేనన్ని ఉద్యోగాల్ని తాను తీసుకొస్తానని.. అక్రమ వలసదారులు దేశంలోకి రాకుండా మెక్సికో సరిహద్దుల్లో భారీ గోడ కట్టనున్నట్లుగా మరోసారి చెప్పారు. తన బిజినెస్ వ్యవహారలన్నీ తన ఇద్దరు కొడుకులకు అప్పగించినట్లుగాఆయన వెల్లడించారు.తాజా మీడియా సమావేశాన్ని చూస్తే.. తొమ్మిది రోజుల్లో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమయంలోనూ ట్రంప్ తన తీరును ఎంతమాత్రం మార్చుకోలేదన్న భావన వ్యక్తమవుతోంది. తన తీరుతో అమెరికా అధ్యక్షుడిగా అయిన ట్రంప్.. చూస్తూ.. చూస్తూ తన తీరును మార్చుకొని.. హుందాగా వ్యవహరిస్తారని అంచనా వేయటం తప్పే అవుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/