Begin typing your search above and press return to search.

ట్రంప్ విదేశీ విధానం ఇలా కామెడీ పాల‌వుతోంది

By:  Tupaki Desk   |   21 May 2017 9:55 AM GMT
ట్రంప్ విదేశీ విధానం ఇలా కామెడీ పాల‌వుతోంది
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విధానం ఇన్నాళ్లు విస్మ‌య‌క‌రంగా ఉండ‌గా...ఇప్పుడు ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. ఒక‌రకంగా అది న‌వ్వు కూడా తెప్పిస్తోందని అంటున్నారు. ట్రంప్ రాజ‌నీతి ఆశ్చ‌ర్యం కూడా క‌లిగించ‌డం ఖాయ‌మే. అధ్య‌క్ష ఎన్నిక‌ల సమయంలో ఇస్లామిక్ ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా పోరాటం చేయాల‌న్నారు. ఆ వాగ్ధానాల‌తో శ్వేత‌జాతి ఓట్ల‌ను గెలుచుకున్న ట్రంప్ దేశాధ్య‌క్షుడ‌య్యారు. ఆ త‌ర్వాత బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ వారంలోనే ఏడు ముస్లిం దేశాల నుంచి వ‌ల‌స‌వ‌స్తున్న వారిని నిషేధించాల‌ని ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల‌తో ట్రంప్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ముస్లిం వ్య‌తిరేకి అన్న ముద్ర వేసుకున్నారు. కానీ దేశాధ్య‌క్షుడ‌య్యాక ట్రంప్ మొద‌ట కాలు పెట్టింది మాత్రం ఇస్లాం పుట్టిన దేశంలోనే కావ‌డం విశేషం.

ట్రంప్ మొద‌టి విదేశీ ప‌ర్య‌ట‌నతో ఎంట్రీ ఇచ్చింది ఇస్లామ్‌ ను అనుస‌రిస్తున్న ముస్లింలు ఎక్కువ‌గా ఉన్న సౌదీ అరేబియాలో. రాడిక‌ల్ ఇస్లామ్‌ ను నిర్మూలిస్తాన‌ని శ‌ప‌థం చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ మ‌తం పుట్టిన దేశంలోనే అడుగుపెట్టడం రాజ‌నీత‌జ్ఞుల‌కు అర్థం కాని ప్ర‌శ్న‌గా మిగిలింది. ఇస్లాం మ‌తస్తులు అమెరికాను ద్వేషిస్తున్నార‌ని కూడా ట్రంప్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో అన్నారు. సెప్టెంబ‌ర్ 11 దాడులు త‌ర్వాత అర‌బ్బులు అమెరికా దీన‌స్థితిని చూసి ఆనందించార‌ని, అలాంటి వాళ్ల‌ను వ‌దిలేది లేద‌ని కూడా ట్రంప్ ఓ సంద‌ర్భంలో అన్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం త‌న విదేశీ విధానాన్ని మార్చేశారు. ముస్లిం దేశాల‌తో దోస్తీ త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన ట్రంప్ ఇప్పుడు ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

ఎప్పుడూ యుద్ధాల‌తో గ‌త అమెరికా అధ్య‌క్షులు ముస్లిం దేశాల‌ను చింద‌ర వంద‌ర చేశారు. కానీ ఇస్లామిక్ ఉగ్ర‌వాదాన్ని అంతం చేయాలంటే ఆ దేశాల స‌హ‌కారం త‌ప్ప‌ద‌ని తెలుసుకున్నారు ట్రంప్‌. ఆ నేప‌థ్యంలో ఆయ‌న సౌదీ టూరేశారు. అంతేకాదు మ‌త‌ప‌ర‌మైన అంశాల‌పైన కూడా ట్రంప్ సౌదీలో కీల‌క వ్యాఖ్య‌లు చేసే అవ‌కాశాలున్నాయి. ఇక డిఫెన్స్‌, పెట్రో ఉత్ప‌త్తుల‌పై వాణిజ్యం కూడా జ‌ర‌పనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/