Begin typing your search above and press return to search.

అధ్యక్షుడి వైఫ్ ను రేప్ చేస్తారట

By:  Tupaki Desk   |   15 Nov 2016 6:07 AM GMT
అధ్యక్షుడి వైఫ్ ను రేప్ చేస్తారట
X
పేరుకు అగ్రరాజ్యమైనా.. అక్కడి ప్రజలు మరీ ఇంత వికృతంగా ఆలోచిస్తారన్న భావన కలిగేలా చేస్తుందీ ఉదంతం. రాజకీయాల్లో అభిమానించేవాళ్లు ఉన్నట్లే.. వ్యతిరేకించేవాళ్లు ఉంటారు. కానీ.. అదేదీ హద్దులు దాట కూడదు. కానీ.. హిల్లరీ మీద అభిమానమో.. ట్రంప్ మీదున్న వ్యతిరేకతమో కానీ ఇప్పుడు వికృత కోణం బయటకు వచ్చింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ.. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన ట్రంప్ మీద ఉన్న వ్యతిరేకత ఆయన సతీమణి మీద చూపిస్తున్నారు కొందరు అమెరికన్లు.

ట్రంప్ మీదున్న వ్యతిరేకతతో.. ఆయన సతీమణి మెలానియాను రేప్ చేస్తామంటూ ఏకంగా హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో రచ్చ రచ్చచేస్తున్నారు. ‘రేప్ మెలానియా ట్రంప్’ పేరిట సాగుతున్న చర్చను చూస్తేనే వారిపై అసహ్యం పుట్టేలా చేస్తోంది. అయితే.. ఇలాంటి దారుణ వ్యాఖ్యలు ఏ ఒకరిద్దరుకాకుండా ఏకంగా 32 వేల మంది ఈ అంశంపై తమదైన రీతిలో రియాక్ట్ కావటం గమనార్హం.

ఈ హ్యాష్ టాగ్ ట్విట్టర్ అకౌంట్లో టాప్ 6 ప్లేస్ లో నిలవటం విశేషంగా చెప్పాలి. ఈ అంశంపై చర్చిస్తున్న వారు.. మెలానియాను రేప్ చేయగలమా? ఎలా చేయగలం? ఎప్పుడు చేయగలం? లాంటి రాయలేని చాలానే వ్యాఖ్యల్ని నిర్లజ్జగా చేసేస్తున్నారు. ఈ అంశంపై నమోదు అవుతున్న ట్వీట్లలో ఆమెకు వ్యతిరేకంగా కొన్ని.. మద్దుతుగా కొన్ని ఉన్నాయి.

ఈ ట్వీట్లను సీరియస్ గా తీసుకొని.. వాటిపై విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. అమెరికాకు కాబోయే ఒక ప్రధమ మహిళ గురించి ఇంత దారుణంగా.. అసహ్యంగా ట్వీట్ల రూపంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమ వికృత చేష్టలతో ఈ రకమైన ప్రచారం చేస్తున్న వారు అమెరికా ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేస్తున్నారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/