Begin typing your search above and press return to search.

ఎలన్ మస్క్ కొనుగోలుపై ట్విట్టర్ వదిలేసిన డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   27 April 2022 2:30 AM GMT
ఎలన్ మస్క్ కొనుగోలుపై ట్విట్టర్ వదిలేసిన డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్స్
X
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల వేళ చేసిన విద్వేశ పూరిత ట్వీట్లకు ఆగ్రహించిన ట్విట్టర్ యాజమాన్యం ఆయనను బ్యాన్ చేసింది. దీంతో సీరియస్ అయిన ట్రంప్ ఏకంగా ట్విట్టర్ నుంచే వైదొలిగారు. ట్విట్టర్ తీరుపై తీవ్ర విమర్శలు చేసి కొత్త సోషల్ మీడియాను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.

అయితే ట్విట్టర్ తీరుపై ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే దాన్ని తాజాగా ప్రపంచంలోనే అపర కుబేరుడు అయిన 'ఎలన్ మస్క్' టేకోవర్ చేశాడు. దీంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను తిరిగి పునరుద్దరించాలని రిపబ్లికన్లు కోరారు.

ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతిలోకి వెళ్లిన సందర్భంగా ఇదే సరైన తరుణమని.. ఆయన ఖాతాను తిరిగి పునరుద్దరించాలని ట్విట్టర్ వేదికగా రిపబ్లికన్లు కోరారు.

ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లడం.. ఆయన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యపు హక్కులపై మాట్లాడడంతో ట్రంప్ ట్విట్టర్ ఖాతాను తిరిగి పునరుద్ధరిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ట్రంప్ స్వయంగా సమాధానమిచ్చారు.

తాను తిరిగి ట్విట్టర్లో ఖాతాను తెరువనని ప్రకటించారు. ఎలన్ మస్క్ చాలా మంచివారని.. అందులో అనుమానం లేదని.. అయితే తాను మాత్రం తిరిగి ట్విట్టర్ ఖాతాను తెరిచేది లేదని స్పష్టం చేశారు.

ఒక అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. తిరిగి ట్విట్టర్ ఖాతా తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఇది నిజమని.. సోషల్ లోనే ఉంటానని.. ఎలన్ మస్క్ ట్విట్టర్ ను మెరుగుపరుస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. అందుకే కొనుగోలు చేశానని అనుకుంటున్నానన్నారు. ఆయన చాలా మంచోడని.. నేను మాత్రం తన సోషల్ మీడియా 'ట్రూత్' సోషల్ మీడియాలోనే ఉంటానని ట్రంప్ స్పష్టం చేశాడు.