Begin typing your search above and press return to search.
ట్రంప్ ఇంటి విలువ జస్ట్ 6.5 కోట్లే
By: Tupaki Desk | 29 March 2017 5:27 AM GMTరియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఎదిగి అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ ఇంటి విలువ ఎంత ఉంటుందో ఊహించండి? మన కరెన్సీలో చూస్తే ఓ 10 కోట్లయిన ఉంటుంది కదా? ఆ రేంజ్ లో మనం ఊహించుకోవడం తప్పేం కాదు అయితే ట్రంప్ ఇంటి విలువ 6.5 కోట్లేనట. ఇదే రేటుకు ఆయన నివసించిన ఇల్లును అమ్మేశారు. అంత తక్కువ ధరా! అని ఆశ్చర్యపోకండి. ఆ ఇల్లు ట్రంప్ చిన్ననాటిది. న్యూయార్క్‌లో ట్రంప్ తన బాల్యాన్ని గడిపిన ఇల్లు రూ.6.5 కోట్లకు అమ్ముడుపోయింది.
తాజాగా అమ్ముడుపోయిన ఇళ్లును 1940లో జమైకా ఎస్టేట్స్‌లో ట్రంప్ తండ్రి ఫ్రెడ్ నిర్మించారు. ట్రంప్ తన మొదటి నాలుగేళ్లను ఈ ఇంట్లో గడిపారు. ట్రంప్ పుట్టినరోజు ధ్రువపత్రాలను సైతం ఈ ఇంటి చిరునామాను నమోదు చేయించారు. ఎర్ర ఇటుకలతో అలంకరించిన ఈ ఇంటికి జవనరిలో వేలం వేశారు. ఆశ్చర్యకరంగా ఈ ఇల్లుకు అనూహ్యమైన డిమాండ్ వచ్చింది. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు డిసెంబర్ లో ఉన్న అమ్మకపు ధర కన్నా 54 శాతం ఎక్కువ ధరకు ఈ ఇల్లు అమ్ముడుపోయింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఎన్బీసీ ఆధ్వర్యంలో నడిచే ద టు నైట్ షోలో కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఆ భవనాన్ని అమ్మకానికి పెట్టడం బాధాకరంగా ఉందని అన్నారు. ప్యారమౌంట్ రియాల్లీ యూఎస్‌కు చెందిన మిషా హఘని ఈ వేలాన్ని నిర్వహించారు. ఇంటిని కొన్న వ్యక్తి వివరాలను ఆయన తెలుపలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/