Begin typing your search above and press return to search.
మోడీని వెక్కిరించిన ట్రంప్!
By: Tupaki Desk | 23 Jan 2018 9:15 AM GMT`ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాకు నిజమైన స్నేహితుడు`.. ఇదీ కొన్నాళ్ల కిందట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట. అయితే ఈ మధ్యే తన ఫ్రెండ్ ను ట్రంప్ వెక్కిరించినట్లు ద వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్ విషయంలో అమెరికా తీరుపై మోడీ చేసిన కామెంట్స్ ను ఉద్దేశించి ట్రంప్ ఇలా వ్యవహరించినట్లు ఆ పత్రిక తెలిపింది. మోడీ భారత యాసను ట్రంప్ అనుకరించినట్లు చెప్పింది. అయితే ఆఫ్ఘనిస్థాన్ విషయంలో మోడీ అభిప్రాయాలను మాత్రం ట్రంప్ గౌరవించడం గమనార్హం.
గత ఉడాది ఓవల్ ఆఫీస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ప్రధాని మోడీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్ విషయంలో అమెరికా తీరుపై భారత్ ఏమనుకుంటున్నదో మోడీ విస్పష్టంగా చెప్పారు. `అసలు ఏ దేశం ఇలా ప్రతిగా ఏమీ పొందకుండా ఇంతలా ఖర్చు చేయడం అసాధారణమే` అని ట్రంప్ తో మన ప్రధానమంత్రి అన్నారు. మోడీ అభిప్రాయాలను ప్రపంచ దేశాల అభిప్రాయంగా ట్రంప్ భావించినట్లు ఆ పత్రిక వెల్లడించింది. ఇదే విషయాన్ని ఓ ఉన్నతాధికారుల సమావేశంలో చెబుతూ.. మోడీని ట్రంప్ అనుకరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. దక్షిణాసియా యాసలో అచ్చం మోడీ ఎలా మాట్లాడతారో అలాగే ట్రంప్ అనుకరణ ఉన్నదని చెప్పింది. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలూ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఉన్న విషయం తెలిసిందే.