Begin typing your search above and press return to search.
విచారణే తరువాయి..ట్రంప్ పదవి దిగడం ఖాయమేనా?
By: Tupaki Desk | 21 Jan 2020 2:13 PM ISTఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి ఎన్నివకడం ఒక ఎత్తైతే.. దానిని నిలబెట్టుకోవడం మరో ఎత్తేనని చెప్పక తప్పదు. అమెరికా అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తే... ఈ మాట నిజమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే... ప్రస్తుతం అమెరికా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ పై అభిశంసన కత్తి వేలాడుతోంది. ఇప్పటికే ట్రంప్ అభిశంసనకు ప్రతిపాదనలు నమోదు కాగా... దానిపై త్వరలోనే విచారణ జరగనున్నది. ఈ విచారణలో ట్రంప్ తాను తీసుకున్న నిర్ణయాలు కరెక్టేనని - వాటి వల్ల దేశానికి ప్రయోజనం జరిగిందని నిరూపించుకుంటే సరే సరి. లేదంటే... ఆయన పదవీచ్యుతుడు కావడం ఖాయమేనన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
తనపై విపక్షాలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానం త్వరలోనే విచారణకు రానున్న సంగతి తెలిసిందే. అయితే తనపై ప్రవేశపెట్టిన అభిశంసనను తిప్పికొట్టేందుకు ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇరాన్ పై కయ్యానికి కాలు దువ్వారన్న వార్తలు కూడా ఆసక్తి రేకెత్తించాయి. ఒక్కసారి అభిశంసన తీర్మానం అమెరికా చట్ట సభల ముందుకు వస్తే... దానిని అడ్డుకోవడం దాదాపుగా దుస్సాధ్యమే. అయితే అభిశంసనకు గురి కాకుండా తన పదవిని కాపాడుకునేందుకు అమెరికా అధ్యక్షుడికి ఓ అవకాశం అయితే ఉంటుంది. అదే విచారణ సందర్భంగా తన వాదనను వినిపించుకునే అవకాశం. మరి ఈ అవకాశాన్ని ట్రంప్ ఎలా వినియోగించుకుంటారన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది.
సరే... ట్రంప్ పదవి నుంచి దిగుతారా? లేదా? అన్నది విచారణ ముగిస్తే గానీ తెలియదు గానీ... అభిశంసనకు గురైతే మాత్రం ట్రంప్ మరో రికార్డును తన పేరిట లిఖించుకోనున్నారు. ఇప్పటిదాకా అమెరికాకు 45 మంది అధ్యక్షులుగా పనిచేయగా... వారిలో కేవలం ముగ్గురు మాత్రమే అభిశంసనకు గురయ్యారు. మిగిలిన వారంతా అమెరికా ప్రజల ఆశయాలకు అనుగుణంగానే పనిచేయడంతో అభిశంసనకు గురి కాలేదు. అయితే వారికి భిన్నంగా వ్యవహరించిన ట్రంప్... అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే సంచలనాలకే సంచలనాలుగా నిలిచిన నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నిర్ణయాల కారణంగానే ఇప్పుడు ట్రంప్ అభిశంసన కత్తి వేలాడుతోంది. ఈ విచారణలో ట్రంప్ తన వాదనను బలపరచుకోకపోతే మాత్రం... అభిశంసనకు గురైన నాలుగో అమెరికా అధ్యక్షుడిగా ఆయన రికార్డులకు ఎక్కనున్నారు.