Begin typing your search above and press return to search.
నోబెల్ బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్ !
By: Tupaki Desk | 1 Feb 2021 11:30 AM GMTఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి రేస్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. రష్యా అసమ్మతి నేత అలెక్సీ నవాల్నీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, పర్యావరణ మార్పులపై పోరాటం చేస్తున్న గ్రెటా థన్ బర్గ్ కూడా నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ అయ్యారు. ఒక్క ట్రంప్ మినహా మిగిలిన వాళ్లందరినీ నార్వేకు చెందిన చట్టసభ ప్రతినిధులు నామినేట్ చేశారు. నిజానికి నోబెల్ బహుమతుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా పార్లమెంట్ల సభ్యులు, సాధారణ ప్రజలు, మాజీ విజేతలు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉంటుంది.
అవార్డు కోసం నామినేషన్ ల ప్రక్రియ ఆదివారంతో ముగియగా, ట్రంప్ పేరు కూడా కనిపించింది. ట్రంప్ తో పాటు స్వీడన్ కు చెందిన 18 ఏళ్ల పర్యావరణ వేత్త గ్రెటా థన్ బర్గ్, రష్యా విపక్ష నాయకుడు అలెక్సీ నావల్సీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. అయితే, గ్రెటా థన్ బర్గ్ కు లేదా కరోనాపై పోరాడుతున్న ప్రపంచ దేశాల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ అవార్డు లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
డబ్ల్యుహెచ్ ఓ కన్నా, అంతర్జాతీయ సదస్సుల్లో పర్యావరణ సంరక్షణపై ప్రసంగిస్తూ, ధైర్యంగా ముందడుగు వేస్తున్న గ్రెటాకు అవార్డును ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. 50 ఏళ్లుగా ఈ కమిటీ నామినీల పేర్లను, రేసులో ఉండి అవార్డు రాని వాళ్ల పేర్లను బయటపెట్టడం లేదు. కానీ నామినేటర్లు మాత్రం తమ నామినీల పేర్లను వెల్లడించవచ్చు. 2021 నోబెల్ బహుమతులను ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రకటిస్తారు.