Begin typing your search above and press return to search.

గాలి స‌న్నిహితుడికి ట్రంప్ ప్ర‌త్యేక ఆహ్వానం

By:  Tupaki Desk   |   3 Feb 2018 11:36 AM GMT
గాలి స‌న్నిహితుడికి ట్రంప్ ప్ర‌త్యేక ఆహ్వానం
X
మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న్ రెడ్డి స‌న్నిహితుడికి ప్ర‌త్యేక ఆహ్వానం దక్కింది. గాలి స‌న్నిహితుడు - బళ్లారి ఎంపీ శ్రీరాములుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి అరుదైన ఆహ్వానం అందింది.అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా గెలిచాక 130 దేశాల ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7 - 8 వ తేదీల్లో విందు ఏర్పాటు చేసిన డోనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రముఖల జాబితాను విడుదల చేశారు.

అగ్ర‌రాజ్య‌ధిప‌తి విందుకు భారతదేశం నుంచి ఇద్దరు నేతలను ఎంపిక చేశారు. ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ - కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి ఎంపీ శ్రీరాములులిద్దరు ఉన్నారు. ఇప్పటికే వీరికి వైట్ హౌస్ నుండి ఆహ్వానం అందినట్టు సమాచారం. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు తనను ఆహ్వానించడం మరిచిపోలేని సంఘటన అని అన్నారు.

కాగా, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ట్రంప్ కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన సంగ‌తి తెలిసిందే. ప్రతిభ ఆధారంగానే వీసాలు జారీ చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. నిపుణులు, సమాజానికి వలందించేవారు - అమెరికాను ప్రేమించి గౌరవించేవారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని ట్రంప్ తన ప్రసంగంలో స్పష్టంచేశారు. గొలుసుకట్టు వలస విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తాను ప్రతిపాదిస్తున్న వలస విధానం న్యాయమైనదని, దీనిపై అందరం కలిసి ఏకాభిప్రాయంతో పనిచేద్దామని అన్నారు. 18లక్షల మంది డ్రీమర్లకు పౌరసత్వం కల్పించడం - అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం - లాటరీ వీసా రద్దు - కుటుంబ ఆధారిత వలస విధానాలకు స్వస్తి చెప్పడం...ఈ నాలుగు అంశాలు కీలకంగా నూతన వలస విధానంలో సంస్కరణలు తేవాల్సిన అవసరముంది.