Begin typing your search above and press return to search.

ట్రంప్ దెబ్బ‌కు కుదేలైన విప్రో!

By:  Tupaki Desk   |   9 Jun 2017 11:02 AM GMT
ట్రంప్ దెబ్బ‌కు కుదేలైన విప్రో!
X
ట్రంప్ ప్ర‌వేశ‌పెట్టిన నూత‌న ఇమ్మిగ్రేష‌న్ విధానం ప‌లు ఐటీ కంపెనీల‌పై తీవ్ర‌మైన‌ ప్రభావం చూపుతోంది. చాలా కంపెనీలు హెచ్1బీ వీసాల్లో భారీగా కోతపెడుతున్నాయి. ట్రంప్ విధానాల వల్ల తాము న‌ష్ట‌పోయామ‌ని భారత ఐటీ దిగ్గజం విప్రో స్ప‌ష్టం చేసింది. చాలా కంపెనీలు అంత‌ర్గ‌తంగా న‌ష్ట‌పోతున్నాయి. అయితే, ఈ విధంగా బహిరంగ ప్రకట‌న చేసిన‌ తొలి కంపెనీ విప్రోనే.

అమెరికా అధ్యక్షుడి వల్ల తొలిసారిగా తమకు నష్టం క‌లిగింద‌ని విప్రో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంచ్ కమిషన్ వార్షిక ఫైలింగ్‌ లో తెలిపింది. రాజకీయ అస్థిర పరిస్థితులు - ఉగ్రదాడులతో తమ లాభాలు గ‌ణ‌నీయంగా త‌గ్గాయ‌ని పేర్కొంది. అమెరికాతోపాటు యూకే - సింగపూర్ - ఆస్ట్రేలియాలు కూడా ఇమ్మిగ్రేషన్ చట్టాల విషయంలో ట్రంప్‌ నే అనుస‌రిస్తున్నాయి. ఈ ప‌రిణామాలు తమను మ‌రింత ఇబ్బందిపెడుతున్నాయ‌ని విప్రో తెలిపింది. ట్రంప్ దెబ్బ‌కు చాలా ఐటీ కంపెనీలు స్థానిక రిక్రూట్‌ మెంట్లను పెంచి, వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించే యోచ‌న‌లో ఉన్నాయి.

తొలి క్వార్టర్ ముగిసే నాటికి తమ కంపెనీలో 50శాతానికి పైగా స్థానిక ఉద్యోగులు ఉంటార‌ని విప్రో తెలిపింది. మ‌రోవైపు ఇన్ఫోసిస్ కూడా వచ్చే రెండేళ్లలో 10వేల మంది అమెరికన్లను నియ‌మించుకోవాల‌ని భావిస్తోంది.అయితే, ట్రంప్ విధానాల వల్ల తాము నష్టపోతున్నామని విప్రో తప్ప మ‌రే కంపెనీ ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/