Begin typing your search above and press return to search.

భార‌త్ పై ట్రంప్ వీసా అస్త్రం!

By:  Tupaki Desk   |   21 Jun 2019 5:19 AM GMT
భార‌త్ పై ట్రంప్ వీసా అస్త్రం!
X
తాను చెప్పిన‌ట్లు మాత్ర‌మే వినాల‌న్న ముకుంప‌ట్టు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కు ఎక్కువ‌న్న సంగ‌తి తెలిసిందే. ఎవ‌రెలా పోయినా ఫ‌ర్లేదు త‌న‌కు మాత్రం అమెరికా ప్ర‌యోజ‌నాలు మాత్ర‌మే ముఖ్య‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ఆయ‌న‌.. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. అమెరికా కోసం దేనికైనా.. ఎంత‌కైనా అన్నట్లుగా తాను ప‌ని చేస్తున్న భావ‌న క‌లిగేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భార‌త్ పైనా అనేక ప‌రిమితులు పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వైనం తెలిసిందే.

ఇదిలా ఉంటే డేటా లోక‌లైజేష‌న్ ఇష్యూలో అగ్ర‌రాజ్యంపై భార‌త్ తెస్తున్న ఒత్తిడికి ప్ర‌తిఫ‌లంగా వీసాల‌పై ప్ర‌భావం చూపించాల‌ని అగ్ర‌రాజ్యం భావిస్తోంది. వినియోగ‌దారుల డేటాను భార‌త్ కు బ‌దిలీ చేయాల్సిందిగా చ‌ట్టం తీసుకొచ్చిన వేళ‌.. ఇప్ప‌టికిప్పుడు లోక‌ల్ గా డేటా స్టోరేజీ ఏర్పాటు క‌ష్ట‌మైన ప‌ని. వ్యాపార‌ప‌రంగా అమెరికాకు న‌ష్టం వాటిల్లుతుంది. ఈ నేప‌థ్యంలో త‌న అమ్ములపొదిలో ఉన్న అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు ట్రంప్‌.

డేటా స్టోరేజ్ లోక‌లైజేష‌న్ కోసం ప్ర‌య‌త్నించే దేశాల వీసాల జారీ విష‌యంలో ఆంక్ష‌లు.. ప‌రిమితులు విధించాల‌ని ట్రంప్ స‌ర్కార్ భావిస్తోన్న‌ట్లుగా చెబుతున్నారు. అమెరికాలో జాబ్ కోసం వెళ్లే విదేశీయుల్లో భార‌తీయులే అధికం. దీనికి తోడు ఇటీవ‌ల కాలంలో భార‌త్ కు దిగుమ‌తి అయ్యే వ‌స్తువుల‌పై మోడీ స‌ర్కారు సుంకం పెంచ‌టంపై గుర్రుగా ఉన్న ట్రంప్.. ఏదోలా భార‌త్ ను ఇబ్బందుల‌కు గురి చేయాల‌న్న ల‌క్ష్యంతో ఉన్నారు.

మోడీ స‌ర్కారు చ‌ర్య‌ల‌కు ప్ర‌తిగా ట్రంప్ స‌ర్కారు హెచ్ 1బీ వీసాల కోటాలో 10-15 శాతం కోత విధించాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అదే జ‌రిగితే భార‌తీయులు పెద్ద ఎత్తున న‌ష్ట‌పోవ‌టం ఖాయం. అయితే.. దీనిపై త‌మ‌కు ఎలాంటి స‌మాచారం లేద‌ని కేంద్రం చెబుతోంది. హెచ్ 1బీ వీసాల విష‌యంలో అమెరికాతో నిరంత‌ర చ‌ర్చ‌లు సాగుతున్న‌ట్లుగా పేర్కొంది. ఏమైనా.. అమెరికా ప్ర‌యోజ‌నాలే త‌న‌కు ముఖ్య‌మ‌ని చెప్పేందుకు తెగ ట్రై చేసే ట్రంప్‌.. వీసాల‌తో షాకిచ్చే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌న్న మాట జోరుగా వినిపిస్తోంది.