Begin typing your search above and press return to search.
వీసాలపై విదేశీయులకు ఇంకో షాకిస్తున్న ట్రంప్
By: Tupaki Desk | 12 July 2017 5:48 AM GMTఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. వీసా సంస్కరణలు ప్రకటించి 'హెచ్-1బీ' వీసాల జారీని కఠినతరం చేసిన ట్రంప్, తాజాగా తన దృష్టి 'స్టార్టప్ వీసా'లపై పడింది. అమెరికాలో స్టార్టప్ కంపెనీలను ఏర్పాటుచేసినవారికి ఇచ్చే..'స్టార్టప్ వీసా'లను ఇవ్వటం లేదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. అంతేకాకుండా వీటిని పూర్తిగా రద్దు చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నట్లు సిగ్నల్స్ ఇచ్చింది. ఈ నిర్ణయం విదేశీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తీవ్ర నిరాశ కల్గించింది. దీంతో పాటుగా క్రమ క్రమంగా అన్ని రకాల వీసాలపై ట్రంప్ సర్కార్ సమీక్ష జరపాలన్న దిశగా అడుగులు వేస్తున్నట్టు కనపడుతోందని అంటున్నారు.
అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనుకూలంగా తాజా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆనాడు వీసా నిబంధనల్ని సరళతరం చేశారు. 'ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రెన్యూర్ రూల్' అనే విధానాన్ని బరాక్ ఒబామా తీసుకొచ్చి మరికొద్ది నెలల్లో దిగిపోతారనగా, 'స్టార్టప్ వీసా'లను ప్రకటించారు. దీని ప్రకారం ఎవరైనా విదేశీయులు అమెరికాలో 'స్టార్టప్ కంపెనీ'లు ఏర్పాటుచేసినట్టయితే, వారికి స్టార్టప్ వీసాలు ఇస్తారు. అంతేగాక అమెరికా ప్రభుత్వం నుంచి ఆ కంపెనీలకు లక్ష డాలర్లు (సుమా రుగా రూ.67 లక్షలు) గ్రాంట్ గా అందుతాయి. ప్రభుత్వ పెట్టుబడి కింద 2 లక్షల 50వేల డాలర్లు కూడా వస్తాయి. కంపెనీలను స్థాపించిన 30 నెలల తర్వాత వీసా గడువును పెంచవచ్చు. ఈ వీసాలను అమల్లోకి తేవాల్సిందిగా ఇటీవల 80 బృందాలు శ్వేతసౌధం వర్గాలను కోరాయి. అంకుర సంస్థల సృష్టిని మరింత బలోపేతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. ఈ వీసా విధానం ఈ ఏడాది జులై 17 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఈ నిర్ణయాన్ని తమ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిందని, దీనిపై మరికొంత సమీక్ష జరుపుతామని, వచ్చే ఏడాది మార్చి 14 వరకూ 'స్టార్టప్ వీసా'లు ఇవ్వబోమని 'డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యురిటీ (డీహెచ్ ఎస్) తన నోటీస్ లో తాజాగా పేర్కొంది. అంతేగాక 'ఫెడరల్ రిజిస్టర్' వెబ్ సైట్ లోనూ ఈ ప్రకటనను ఉంచింది. 'ఈ నిబంధనను అమలు చేయడానికి అవసరమైన సూచనలను, సలహాలను ప్రజల నుంచి సేకరిస్తాం` అని సదరు నోటీస్‌లో పేర్కొన్నారు. ఈ ప్రకారం ప్రస్తుతానికైతే విదేశీయులకు ఇచ్చే 'స్టార్టప్ వీసా'లను తాత్కాలికంగా రద్దు చేసినట్టే.
ఈ ఏడాది జనవరి 25న నూతన అధ్యక్షుడు ట్రంప్ వలస విధానం, సరిహద్దు భద్రతకు సంబంధించి కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేయటంతో 'స్టార్టప్ వీసా'ల అమలు వాయిదా పడింది. స్టార్టప్ వీసాలపై ట్రంప్ సర్కారు ఆసక్తికరమైన వాదన వినిపిస్తోంది. ఈ వీసా విధానం పూర్తిగా విదేశీయులు అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం కల్పించారని ట్రంప్ సర్కార్ చెబుతోంది. దీన్ని రద్దు చేయాలా..? సంస్కరణలు ప్రవేశపెట్టాలా..? అనే అంశాలపై పరిశీలన జరుపుతామని తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై టెక్ దిగ్గజాలు భగ్గుమన్నాయి. అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్, వంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. వర్క్ వీసా విధానాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అన్ని టెక్ కంపెనీలు ఒక్కటైనట్టు ఈ విషయంలో కూడా ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.