Begin typing your search above and press return to search.
ట్రంప్ అధ్యక్షుడయ్యాక తొలి పరీక్ష..
By: Tupaki Desk | 5 Nov 2018 12:16 PM GMTఅమెరికాలో మధ్యంతర ఎన్నికలకు వేళయ్యింది. అమెరికా సెనెట్ లో మొత్తం 435 స్థానాలున్నాయి. ఇందులోని 100 సెనెట్ స్థానాల్లో 35 సెనెట్ స్థానాలకు ఈ నెల 6న మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయ్యాక మధ్యలో వచ్చిన ఈ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రతినిధుల సభ - సెనేట్ తోపాటు 39 రాష్ట్రాలు - ప్రాదేశిక మండళ్లకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాన పార్టీలైన డెమోక్రాట్లు - రిపబ్లికన్లు ఇందులో మెజార్టీ సీట్లు సాధించి వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు ప్రారంభించాయి.
అమెరికా అధ్యక్షుడికి ఈ ఎన్నికలు రెఫరెండంగా మారాయి. ఆయన 22 నెలల పాలనకు తీర్పుగా డెమొక్రాట్లు భావిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ కు ఎక్కువ సీట్లు వస్తే మాత్రం అమెరికాలో మరిన్ని వివాదాస్పద నిర్ణయాలు - ఆధిపత్య చర్యలకు మార్గం సుగమం అవుతుందని ప్రతిపక్ష డెమోక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ దూకుడుకు ముకుతాడు వేసేలా ప్రజలు తీర్పునిస్తారని డెమోక్రాట్లు భావిస్తున్నారు. అయితే మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీలకు 1934 నుంచి కలిసిరాలేదు. ఈ ఎన్నికల్లో కేవలం మూడు సార్లు మాత్రమే అధ్యక్ష పార్టీ గెలవడం విశేషం.
కాగా ఈ ఎన్నికలపై జరిగిన తాజా సర్వేలో ట్రంప్ కు ఓటేసిన 51శాతం మంది ఇప్పుడు ఆయన వ్యతిరేకిస్తున్నట్టు తేలింది. ఇది డెమొక్రాట్లకు కొండంత బలంగా మారింది. కాగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నట్టే ఈ ఎన్నికల్లోనూ రష్యా - చైనాలు వేలుపెడుతున్నాయని తాజాగా అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడం విశేషం.
మధ్యంతర ఎన్నికలకు పోలింగ్ మంగళవారం జరగబోతోంది. ఈ ముందస్తు ఎన్నికల్లో గతంలో కంటే చాలా ఎక్కువ పోలింగ్ నమోదు కానుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా 3.15 కోట్ల మంది ఇప్పటికే ముందస్తు ఓటింగ్ వేశారని తెలిపారు.