Begin typing your search above and press return to search.
మోదీ కోసం పెళ్లిళ్ల పేరయ్యనవుతా:ట‌్రంప్
By: Tupaki Desk | 14 Aug 2018 10:53 AM GMTతన వివాదాస్పద వ్యాఖ్యలు - చర్యలు - చేష్టలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. నాన్ లోకల్స్ పై ట్రంప్ వైఖరి మొదలు....భార్య మెలానియాతో ఎడమెహం పెడమొహంగా ఉండడం...పోర్న్ స్టార్ తో ఎఫైర్....ఇలా ట్రంప్ పేరు కొంతకాలంగా మీడియాలో నలుగుతోంది. తాజాగా, ట్రంప్ తన నోటిదురుసుతో మరోసారి వార్తల్లో నిలిచారు. భారత ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మోదీ మరో పెళ్లికి సిద్ధమైతే తాను పెళ్లికూతురిని వెతికిపెడతానంటూ వెటకారపు వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం భారత్ - అమెరికా అధ్యక్షుల సమావేశం సందర్భంగా ట్రంప్ ఈ చమత్కారపు వ్యాఖ్యలు చేసినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ వార్తా పత్రిక పొలిటికో సంచలన కథనాన్ని వెలువరించింది. మోదీ రెండో పెళ్లిపై ట్రంప్ జోక్....సోషల్ మీడియాలో వైరల్ అయింది.
డొనాల్డ్ ట్రంప్ కు నోటిదురుసు ఎక్కువన్న సంగతి మరోసారి రుజువైంది. కొంతమంది విదేశీ నేతలతో కూడా ట్రంప్ మర్యాదపూర్వకంగా నడుచుకోరని ఓ టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే విదేశీ నేతల సమావేశాల సందర్భంగా ట్రంప్ వ్యవహార శైలి - మర్యాదల గురించి ‘దౌత్య సమావేశాలు - తప్పిదాలు పేరుతో పొలిటికో ఓ కథనాన్ని వెలువరించింది. విదేశీ నేతలతో ట్రంప్ వింత ప్రవర్తన సన్నివేశాలు - టెలిఫోన్ మర్యాదలు మర్చిపోయిన సందర్భాలు - ఇతర దేశాల పేర్లను తప్పుగా ఉచ్ఛరించిన సందర్భాలు ప్రచురించింది. దక్షిణాసియా దేశాల గురించి ట్రంప్ కు కనీస అవగాహన లేదని కథనంలో వెల్లడించింది. దక్షిణాసియా మ్యాప్ ను చూసిన ట్రంప్.... నేపాల్ - భూటన్ లపేర్లను ‘నిపుల్' - ‘బుట్టోన్'గా పలికారట. దాంతోపాటే ఆ దేశాలన్నింటిని ఇండియాలో భాగమేనని ట్రంప్ ఫీలింగట. ఆ సమావేశం సందర్భంగా...తన భార్యతో కలిసి ఉండటం లేదని ట్రంప్ నకు వైట్ హౌస్ అధికారులు తెలిపారట. దీంతో, వెంటనే ట్రంప్ మోడీ కోసం పెళ్లిళ్ల పేరయ్య అవతారమెత్తుతానని ఇద్దరు అధికారులతో అన్నట్లు పొటిటికో తమ కథనంలో వెలువరించింది.