Begin typing your search above and press return to search.
హిల్లరీ - ట్రంప్... మళ్లీ డైలమా!
By: Tupaki Desk | 30 Aug 2016 4:55 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంత పోటాపోటీగా సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగానూ రెండు పక్షాల వారు దుమ్మెత్తు పోసుకుంటున్న పరిస్థితి. ప్రత్యర్థులపై విరుచుకుపడే విషయంలో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీతో పోలిస్తే.. రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ దూకుడుగా వెళుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంది? ఎవరు అధిక్యంలో ఉన్నారన్న విషయానికి వస్తే.. ట్రంప్ కంటే హిల్లరీనే అధిక్యతలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
పైకి అలానే కనిపిస్తున్నా.. ట్రంప్ ను కొన్ని రాష్ట్రాల వారు ఇస్తున్న మద్దతు డెమొక్రాట్లకు మింగుడుపడని విధంగా మారింది. తన కంపు వ్యాఖ్యలతో ట్రంప్ తన ఓటమిని తానే కొని తెచ్చుకుంటారని.. హిల్లరీ విజయం నల్లేరు మీద నడకేనని పలువురు భావించినా.. వాస్తవ పరిస్థితి అలా లేదని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ అధిక్యం ఆశించిన దాని కంటే ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజాగా నిర్వహించిన సర్వేలో ఒహియాలో ట్రంప్.. హిల్లరీలకు సమాన అధిక్యం రావటం గమనార్హం. మరికొన్ని రాష్ట్రాల్లో సైతం హిల్లరీ.. ట్రంప్ ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకూ నిర్వహించిన సర్వేలలో హిల్లరీ క్లింటన్ కు స్పష్టమైన మెజార్టీ లభిస్తున్నట్లు కనిపిస్తున్నా.. కొన్ని రాష్ట్రాల్లో పోటీ నువ్వా-నేనా అన్నట్లు సాగుతుండటం గమనార్హం. దీంతో.. విజయం పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నా డెమొక్రాట్లు మాత్రం తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నట్లు చెబుతున్నారు. ముందు అనుకున్నట్లు ట్రంప్ తో పోటీ హిల్లరీకి చాలా ఈజీగా భావించారు. కానీ.. అనుకున్నంత తేలిగ్గా పోటీ ఉండటం లేదన్న మాటను పలువురు చెబుతున్నారు.