Begin typing your search above and press return to search.
ఆ వీడియోతో ట్రంప్ ఇమేజ్ మొత్తంగా డ్యామేజ్!
By: Tupaki Desk | 9 Oct 2016 5:48 PM GMTఅనుకోని పరిణామం. ఒక్కటంటే.. ఒక్క వీడియో టేప్ తో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి జాతకం మొత్తం మారిపోయింది. అమెరికాలో అత్యంత పురాతన పార్టీల్లో ఒకటైన రిపబ్లికన్ పార్టీ చరిత్రలో కనివినీ ఎరుగని రాజకీయ మహా సంక్షోభంలో చిక్కుకుపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రంప్ కు సంబంధించిన పాత వీడియో ఒకటి వాషింగ్టన్ డీసీ విడుదల చేయటం.. ఇందులో మహిళల పట్ల ట్రంప్ అత్యంత కిరాతకంగా చేసిన లైంగిక వ్యాఖ్యలు అమెరికన్ మహిళలు తీవ్రంగా వ్యతిరేకించటమే కాదు.. ట్రంప్ పై విరుచుకుపడుతున్నారు. ఈ వీడియో బయటకు రావటంతో ఇరుకున పడిన ట్రంప్.. తాను చేసింది చాలా పెద్ద తప్పు అంటూ సారీల మీద సారీలు చెబుతూ వేడుకుంటున్నా.. అతగాడి సారీలను వినటం లేదు.
తాజాగా విడుదలైన వీడియో నేపథ్యంలో మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత మాత్రమే కాదు.. ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేతలు సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థి పదవి నుంచి వెంటనే తప్పుకోవాలంటూ పార్టీకి చెందిన కీలక నేతలు పలువురు గళం విప్పారు. రిపబ్లికన్ పార్టీ నేతల్లో ట్రంప్ మీద వ్యతిరేకత రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.
వాషింగ్టన్ పోస్టు విడుదల చేసిన వీడియోతో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారిపోవటమే కాదు.. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రెండో డిబెట్ జరగనున్న వేళ.. విడుదలైన ఈ వీడియోతో ట్రంప్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు. ట్రంప్ కు సంబంధించి బయటకు వచ్చిన వీడియోపై డజనకు పైగా రిపబ్లికన్ పార్టీ నేతలు ఆయన్ను అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి బయటకు వచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల సంగతిని పక్కన పెడితే.. సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న వేళ.. ట్రంప్ రియాక్షన్ ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ.. ట్రంప్ కానీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటే మాత్రం అదో అరుదైన సంచలనంగా మారుతుందని చెప్పకతప్పదు. మూర్ఖత్వానికి.. మొండితనానికి నిలువెత్తు రూపమైన ట్రంప్ బరి నుంచి వెనక్కి తగ్గే అవకాశం ఉందా? అన్నది అసలుసిసలు ప్రశ్న.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/