Begin typing your search above and press return to search.

వాళ్ల చేతులకు తుపాకులివ్వాలి: ట్రంప్ సంచలనం

By:  Tupaki Desk   |   30 May 2022 2:30 AM GMT
వాళ్ల చేతులకు తుపాకులివ్వాలి: ట్రంప్ సంచలనం
X
టెక్సాస్‌లోని ఉవాల్డే పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రోబ్ ఎలిమెంటరీ పాఠశాలలో 18 ఏళ్ల సాల్వడార్ రామోస్ కాల్పులు జరపడంతో శుక్రవారం 19 మంది పిల్లలు మరియు ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు.

తన కొడుకు రాక్షసుడు కాదని గతంలో చెప్పిన షూటర్ సాల్వడార్ రామోస్ తల్లి ఇప్పుడు అందరినీ క్షమించమని కోరింది. అడ్రియానా మార్టినెజ్ తాజాగా కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేసింది. నా కొడుకు ఎందుకు ఇలా కాల్పులు జరిపాడో తనకు తెలియదని చెప్పింది.

దీనికి అతడి స్వంత 'కారణాలు' కారణం కావచ్చని ఆమె చెప్పింది. కాల్పులకు తెగబడ్డ నా కొడుకు అసలు ఏమి ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు" అని ఆమె వివరించింది.

టెక్సాస్ స్కూల్ లో మారణహోమం గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హ్యూస్టన్ లోని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడారు. ‘తుపాకీతో కాల్పులకు పాల్పడుతున్న చెడ్డ వ్యక్తిని నియంత్రించాలంటే మంచి వ్యక్తి కూడా తుపాకీని చేతబట్టాల్సిందేనని అన్నారు.

ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెత మాదిరి ఇలాంటి నరమేధాన్ని ఆపాలంటే మంచివాళ్లకు కూడా తుపాకీని చేతపట్టకు తప్పదని హెచ్చరించారు. తుపాకీ రహిత పాఠశాలలను మూసివేయాలని పిలుపునిచ్చారు.

ఎప్పుడైనా ఒక సాయుధ వ్యక్తి ఇలానే దాడులకు దిగితే ఆయుధాలు (తుపాకీ) లేని పాఠశాలలు తమను తాము రక్షించుకోలేవంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలకు సింగిల్ పాయింట్ ఆప్ ఎంట్రీ, స్ట్రాంగ్ ఫెన్సింగ్, మెటల్ డిటెక్టర్లు తప్పనిసరిగా ఉండాలని ట్రంప్ సూచించారు. ఇక ఉక్రెయిన్ కు సాయం చేస్తున్న అమెరికాకు స్కూళ్లలో ఈ సౌకర్యాలను కల్పించడం ఏమంత పెద్ద విషయం కాదని అన్నారు.